Aishwarya Rai: సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీల పర్సనల్ విషయాల్లో గోప్యత లేకుండా పోయింది. స్టార్ల వ్యక్తిగత విషయాల దగ్గర నుంచి సినిమాల వరకు అన్ని సోషల్ మీడియాలో ప్రత్యేక్షమవుతున్నాయి. ఇక స్టార్లు.. బయట ఒక్కటిగా కనిపించడం ఆలస్యం.. ఆ జంట విడిపోయారంటూ పుకార్లు పుట్టించేస్తారు. తాజాగా బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్- హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఇదేమి కొత్త పుకారు కాదు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు నెలకొన్నాయని, ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. వారి వాటిని ఖండిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మరోసారి ఈ రూమర్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అయితే ఇలా అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు.
Samnatha: న్యూడ్ సీన్స్.. సమంత మళ్లీనా..?
గత కొన్నిరోజులుగా ఐశ్వర్య కెమెరా కంటికి సింగిల్ గానే కనిపిస్తుంది. మొన్న జరిగిన నీతా అంబానీ ఈవెంట్ లో కూడా ఐష్.. కూతురుతో కనిపించింది కానీ అభిషేక్ తో రాలేదు. ఎయిర్ పోర్టులో కానీ, ముంబై ఈవెంట్స్ లో కానీ ఐష్ ఒక్కతే కనిపిస్తుంది. దీంతో ఈ విడాకుల మ్యాటర్ చాలా సీరియస్ అయ్యింది. ఐష్- అభిషేక్ విడాకులు అంటూ బాలీవుడ్ మీడియా సైతం కోడై కూస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే ఈ జంట నోరు విప్పాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం ఐష్.. పొన్నియిన్ సెల్వన్ 2 లో నటిస్తోంది. నందినిగా ఆమె నటన అద్భుతమని పార్ట్ 1 లోనే చెప్పుకొచ్చారు అభిమానులు.. పార్ట్ లో అంతకు మించి ఉండనున్నదని మేకర్స్ తెలుపుతున్నారు. మరి ఈ సినిమాతో ఐష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.