Ahimsa Trailer: దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో రాబోతున్నాడు. దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెల్సిందే. ఆ బాధ్యతను నెత్తిమీద పెట్టుకున్నాడు డైరెక్టర్ తేజ. ఆయన దర్శకత్వంలో అభిరామ్ నటిస్తున్న చిత్రం అహింస. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై ఈ మూవీని జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది.
ఒక సాదాసీదా జీవితాన్ని గడిపే యువకుడు.. మెడికల్ మాఫియాలో ఇరుక్కొని పెద్దవారితో కోర్టులో న్యాయం కోసం తలపడడమే సినిమా కథగా తెలుస్తోంది. దానికోసం ఆ యువకుడు అహింసను పక్కనపెట్టి హింసలోకి ఎలా దిగాడు.. తనవారిని కాపాడుకోవడానికి, ధర్మం కోసం యుద్ధం చేసిన యువకుడు చివరికి గెలిచాడా..? లేదా..? అసలు ఆ యువకుడి కథలోకి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఎవరు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. టీజర్ తోనే కథను కొద్దిగా రివీల్ చేసిన తేజ ట్రైలర్ త తన మార్క్ కథనే చూపించనున్నట్లు చెప్పుకొచ్చేసాడు. ఇక రఘు అనే పాత్రలో అభిరామ్ కనిపిస్తుండగా.. అతడికి హెల్ప్ చేసే లాయర్ పాత్రలో సదా కనిపిస్తోంది. ఇక రఘు మరదలిగా గీతిక కనిపించింది. మొత్తానికి ఈ ట్రైలర్ తో కొంత అంచనాలను పెంచాడు తేజ. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అభిరామ్ హీరోగా నిలబడతాడా..? లేదా..? అనేది చూడాలి.