హీరోల అభిమానులు ఎప్పుడు ఎలా ఉంటారు? దేనికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలియదు. ఒకరి పైన అభిమానం ఇంకొకరిపైనా ద్వేషంగా మారుతోంది. అభిమానాన్ని చాటు క్రమంలో హీరోల అభిమానులు ఇతరులపై నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. గతంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ మరణానికి బాధతో స్టేజ్ పైన కన్నీరు పెట్టుకున్నాడు. తండ్రి లేకపోవడంతో ఎన్టీఆర్… అభిమానులే నాకు అన్నీ అని ఎమోషనల్ గా మాట్లాడాడు. ఎన్టీఆర్ మాటలని కొంతమంది ప్రమోషనల్ స్టంట్ అంటూ సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేసారు. ఇలాంటి సంఘటనే ప్రభాస్ విషయంలో కూడా జరిగింది. కృష్ణంరాజు చనిపోయినప్పుడు ప్రభాస్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇలాంటి సమయంలో కూడా ప్రభాస్, తనని కలవడానికి వచ్చిన వారికి భోజనాలు పెట్టించాడు. దీనిపై కూడా నెగటివ్ కామెంట్స్ చేస్తూ “భోజనాలు అయిపోయాయా ఫ్రెండ్స్” అంటూ విమర్శలు చేసారు.
ఏ విషయంలో మీమ్స్ వేయాలి, ఏ విషయంపై కామెంట్స్ చేయాలి అనేది కూడా తెలియక సినీ అభిమానులు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ చేసుకునే క్రమంలో పడ్డాడు. ఎన్టీఆర్, ప్రభాస్ లకి అయినట్లే ఇప్పుడు మహేష్ బాబుకి కూడా జరుగుతోంది. ఇక వర్గం సినీ అభిమానులు… గుంటూరు కారం ప్రీరిలీజ్ స్టేజ్ పైన నిలబడి మహేష్ ఎమోషనల్ అయ్యాడు. ఆరోజు ఎన్టీఆర్, ప్రభాస్ విషయంలో జరిగింది ఇప్పుడు మహేష్ బాబు విషయంలో జరుగుతోంది. ఒకరు మొదలుపెట్టారు అని ఇంకొకరు కంటిన్యూ చేస్తున్నారు కానీ ఒక్కరు కూడా ఆపట్లేదు, సోషల్ మీడియాలో హుందాగా ప్రవర్తించట్లేదు. హీరోలు కూడా మనుషులే వాళ్లకి కూడా ఎమోషన్స్ ఉంటాయి అనే విషయం అర్ధం చేసుకోని ప్రతి హీరో అభిమాని ఇలాంటి మ్యాటర్స్ లో కాస్త సెన్సిటివ్ గా ఉంటే బాగుంటుంది.