రోజురోజుకు కరోనా విజృభిస్తుంది. కరోనా థర్డ్ వేవ్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇక ఈ మహమ్మారి వలన చిత్ర పరిశ్రమ కుదేలు అవుతోంది. ఇటీవల థర్డ్ వేవ్ విజృంభిస్తుండడంతో సినిమాలను వాయిదా వేయడం తప్ప మేకర్స్ కి వేరే గత్యంతరం కనిపించడం లేదు. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల నుంచి సాధారణ సినిమాల వరకు చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్ ని మార్చుకున్నాయి. తాజాగా అదే కోవలోకి చేరింది అడవి శేష్ ” మేజర్” శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంను సోని పిక్చర్స్, జీ. మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ మరియు a+s మూవీస్ పతాకంపై సంయుక్తం గా నిర్మిస్తున్నారు.
మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 11 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్త్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ” ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. నియమాల దృష్ట్యా మేజర్ సినిమాను వాయిదా వేస్తున్నాం. దేశం కోసం తెరక్కించిన మేజర్ చిత్రాన్ని.. దేశంలోని పరిస్థితులు అన్ని చక్కబడ్డాకా మరో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించి విడుదల చేస్తాం.. అప్పటివరకు మీరు జాగ్రత్తగా ఉండండి” అంటూ చెప్పుకొచ్చారు.