Adipurush:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్ లోకి వస్తుందా అని అభిమానులందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అసలు ఎప్పుడో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. విఎఫ్ఎక్స్ సరిగ్గా రానికారణంగా ఈ సినిమాను జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ప్ ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా.. కృతి సీతగా కనిపిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఓ రేంజ్ లో అదరగొడుతుంది. ఇప్పటికే ఈ సినిమాకున్న హైప్ వలన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియాల హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఏకంగా రూ. 170 కోట్లకు పీపుల్స్ మీడియా ఆదిపురుష్ రైట్స్ ను సొంతం చేసుకుందని సమాచారం. ఇది మాములు రికార్డ్ కాదు.
Vijay: ఏంటీ.. విజయ్ ది సొంత జుట్టు కాదా.. మహేష్ లానేనా..?
టాలీవుడ్ మొత్తంలోనే ఇంత భారీ ధరకు అమ్ముడుపోయిన రెండో సినిమాగా ఆదిపురుష్ నిలిచింది. అయితే మొదటి సినిమా ఏది అంటారా..? ఇంకేంటిది.. ఆర్ఆర్ఆర్ యే. ఈ సినిమా రూ. 191 కోట్ల బిజినెస్ చేసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు దాని తరువాత స్థానం ఆదిపురుష్ ది అని చెప్పాలి. త్వరలోనే మేకర్స్ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారట. ఇదే కనుక నిజమైతే.. డార్లింగ్ ఖాతాలో మరో రికార్డ్ పడడం ఖాయం. ఇక ఆదిపురుష్ సినిమా కోసం చిన్న సినిమాలు తమ రిలీజ్ లను వాయిదా వేసుకున్నాయి. థియేటర్లకు కొదువే లేదు. మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. మళ్లీ ప్రభాస్ రికార్డులను తిరగరాయడం ఖాయమేనని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి ప్రభాస్ ఆ రికార్డులను ఎలా తిరగరాస్తాడో చూడాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.