Vijay: సాధారణంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య.. జుట్టు రాలిపోవడం. ఎంత కాస్ట్లీ షాంపూలు వాడినా ఎంత మంచి ఫుడ్ తిన్నా జుట్టు రాలే సమస్య మాత్రం పోవడం లేదు. అయితే హీరోల జుట్టు మాత్రం ఎప్పుడు ఒకేలా ఎలా ఉంటుంది..? ప్రతి సినిమాకు వారు ఎలా జుట్టును స్టైల్ చేసుకుంటున్నారు..? అసలు ఏది జుట్టు ఒరిజినల్.. ఎవరి జుట్టు విగ్ అనే విషయమై అందరికి అనుమానాలు ఉన్నాయి. ఇటీవల దసరా సినిమా ప్రమోషన్స్ లో నాని జుట్టును చూసి ఒక యాంకర్ .. మీది ఒరిజినల్ జుట్టేనే అడిగేశారు. ఇక నాని దానికి నన్ను అడిగితె అడిగారు కానీ, మిగతా ఏ హీరోను ఇలా అడగకండి. నాది ఒరిజినల్ కాబట్టి నేను చెప్పేస్తాను. చాలామంది అలా చెప్పలేరు అంటూ సెటైర్ వేశాడు. ఇక ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో ప్రభాస్ ది ఒరిజినల్ హెయిర్ కాదని, ఆయన విగ్ వాడుతున్నారని వార్తలు వచ్చాయి. దానికి ప్రూఫ్ గా ఒక వీడియోను కూడా చూపించారు. ఇక మహేష్ బాబు సంగతి అందరికి తెల్సిందే. ఆయన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసమే లక్షలు ఖర్చుపెడతాడని టాక్ ఉంది. అందులో నిజం ఎంత అనేది తెలియదు. ఇకపోతే ఇక్కడ మహేష్ లానే కోలీవుడ్ లో విజయ్ కూడా హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
KL Rahul: నా భర్తను అనడానికి మీరెవరు.. అడల్ట్ క్లబ్ ఫొటోపై రాహుల్ భార్య ఫైర్
కోలీవుడ్ స్టార్ విజయ్ వయస్సు 48. ఇప్పటికీ ఒత్తైన జుట్టుతో కుర్రహీరోలకు ధీటుగా కనిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా మాస్టర్, బీస్ట్ సినిమాలో విజయ్ హెయిర్ స్టైల్ కు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయిదు ఆ జుట్టు ఒరిజినల్ నా,.. కాదా..? అన్న విషయం మాత్రం ఎవరికి తెలియదు. అయితే విజయ్ తో పనిచేసిన డైరెక్టర్స్ లో ఒకరైన లక్ష్మణన్.. విజయ్ విగ్గు వాడలేదు కానీ, ఆయన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు లానే ఈయన కూడా ఆ జుట్టుకోసం భారీగా ఖర్చుచేస్తాడట. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఇప్పటివరకు విజయ్ ది సొంత హెయిర్ అనుకున్నామే అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం విజయ్ లియో సినిమాలో నటిస్తున్నాడు.