Actress Sunainaa health Update:తమిళ నటి సునయన తెలుగు అమ్మాయే అయినా తమిళంలో ఎక్కువగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమెను తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగులో కూడా ఆమె కొన్ని గుర్తుంచుకోదగ్గ సినిమాల్లో నటించి మెప్పించింది. రాజా రాజా చోర, లాఠీ సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆమె వరుస సినిమాలతో ఇరగదీస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సునయన హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటో షేర్ చేయడంతో ఆమె అభిమానులు టెన్షన్ లో మునిగిపోయారు. ఆమె తన సోషల్ మీడియాలో ఒక పోస్టు ద్వారా ఒక ఫోటోను షేర్ చేసింది, అందులో హాస్పిటల్ బెడ్ పై.. ఆక్సిజన్ పెట్టుకొని కనిపించిస్తూ ” నాకు కొంత సమయం ఇవ్వండి.. నేను మళ్లీ తిరిగి వస్తాను” అని రాసుకొచ్చింది.
Japan: ‘జపాన్’ తెలుగు హక్కులు కొనేసిన నాగార్జున
దీంతో అసలు ఆమెకు ఏమైందో అని అభిమానులు కంగారు పడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా షూటింగ్ అయ్యి ఉంటుంది అని కొందరు భావిస్తుంటే మరి కొందరు ఇది నిజమే అయి ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. ఇక ఇలా టెన్షన్ పడుతూ ఉండడంతో ఆమె తన ఆరోగ్యం గురించిన అప్డేట్ ఇచ్చింది. నేను నిన్నటి కంటే ఇప్పుడు చాలా బెటర్ గా ఉన్నాను, త్వరలో నేను లేచి నా పని నేను చేసుకుంటాను అని ఆమె రాసుకొచ్చారు. నిజానికి అసలు ఆమెకు ఏమైంది అనే విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆమె కోలుకున్నాక అసలు తనకు ఏం జరిగిందో సునయన చెబుతుంది ఏమో చూడాలి.