సల్మాన్ ఖాన్ తో సమంత డేటింగ్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వివాదాలు .. లవ్ స్టోరీలు, బ్రేకప్ లు.. అబ్బో ఒకటి కాదు.. రెండు కాదు చప్పుకొంటూ పోతే చాంతాడంతా లిస్ట్ ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రతి ఒక్కరితో సల్లు భాయ్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇక మధ్యమధ్యలో హాలీవుడ్ హీరోయిన్లు కూడా యాడ్ అవుతూ ఉంటారు. ఇక తాజాగా ఆ లిస్ట్ లోకి అమెరికా భామ సమంత లాక్వుడ్ చేరింది. ఈ హాలీవుడ్ హీరోయిన్ గత కొన్ని రోజులు సల్లు బాయ్ ఫామ్ హౌస్ లో ఉండడం, అప్పుడప్పుడు సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ ఫంక్షన్ లో అమ్మడు కనిపించడంతో వీరిద్దరి మధ్య సీక్రెట్ డేటింగ్ నడుస్తుందని పుకార్లు గుప్పుమన్నాయి. వీరి రిలేషన్ గురించి ఆ నోటా ఈనోటా మాట్లాడుకుంటూ చివరికి సమంత వరకు చేరడంతో ఆమె కొద్దిగా సీరియస్ అయ్యింది.
” ఇటీవల చాలా వార్తలు వింటున్నాను.. ప్రజలు చాలానే మాట్లాడతారు. కానీ, అందులో నిజం లేదు. నేను సల్మాన్ ని కలిశాను .. అతను చాలా మంచి వ్యక్తి. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమి లేదు. నేను సల్మాన్ ని కలిసినట్టే హృతిక్ ని కలిశాను. కానీ అప్పుడు ఇలాంటి వార్తలు రాలేదు. అస్సలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియడం లేదు” అంటూ ఘాటుగానే స్పందించింది. ఇక దీంతో సమంత కూడా సల్లు భాయ్ కి సెట్ కాలేదని తెలుస్తోంది. వీరిద్దరి రిలేషన్ నిజమని త్వరలోనే సల్మాన్ పెళ్లి అనే వార్తలు విని ఆనందపడిన అభిమానులు కాస్త మరోసారి నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఈ అమెరికా భామ చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
- Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
- Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
- Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!


తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్‌కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!