Raasi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్న ఈ భామ .. ఆ తరువాత విజయాల పరంపరను కొనసాగించలేకపోయింది. స్టార్ హీరోల సరసన నటించినా కూడా అమ్మడికి ఆశించిన ఫలితం దక్కలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక టాలీవుడ్ సెట్ అవలేదేమో అని కోలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ కూడా బ్యాడ్ లక్ ఎదురవడంతో బాలీవుడ్ కు వెళ్ళింది. ఇక ఒక వెబ్ సిరీస్ ద్వారా అమ్మడికి మంచి పేరు వచ్చింది. మొదటి నుంచి ముద్దుగా బొద్దుగా ఉండే ఈ భామ ఒక్కసారి జీరో సైజ్ కు వచ్చి షాక్ ఇచ్చింది. ఎప్పుడైతే జీరో సైజ్ కు వచ్చిందో అందాల ఆరబోతకు సిద్దమయ్యింది. బాలీవుడ్ లో లిప్ లాక్ లు, ఇంటిమెంటెడ్ సీన్స్ తో రెచ్చిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాశీ.. తన వెయిట్ లాస్ సీక్రెట్ ను బయటపెట్టింది. తాను బరువు తగ్గడానికి తన బాయ్ ఫ్రెండ్ కారణమని చెప్పుకొచ్చింది.
Naveen Vijaya Krishna: విజయ నిర్మల పెద్ద మనవడు.. నరేష్ కొడుకు ఏంటి ఇలా మారిపోయాడు..?
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ మాట్లాడుతూ.. ” కొన్ని అనారోగ్య సమస్యలు కారణంగా నేను బరువు పెరిగాను. తగ్గడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ, నా వలన కాలేదు. ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఆ సమయంలో నాకు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. అతనితో డేటింగ్ ప్రారంభించాను. అప్పటినుంచి నేను బరువు తగ్గడం మొదలుపెట్టాను. బరువు తగ్గడానికి మానసిక ప్రశాంతతకు చాలా సంబంధం ఉంది. ఎవరైనా మానసికంగా సంతోషంగా ఉంటే, అది వారి శరీరాకృతిపై ప్రతిబింబిస్తుంది” అని చెప్పుకొచ్చింది. ఇక రాశీ చెప్పిన ఆ వ్యక్తి ఎవరా అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.