PriyaMani: ప్రస్తుతం ఇండస్ట్రీలో విడాకుల పర్వం ఎక్కువైపోతున్నాయి. తారలు తమ పాట్నర్స్ తో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే తెలుగులో సమంత- నాగ చైతన్య విడాకుల గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారు. ఇక సామ్ లానే మరో సీనియర్ బ్యూటీ విడాకులు తీసుకుంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రియమణి. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్న ఈ భామ తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ముస్తఫా రాజ్ ను వివాహమాడి సెటిల్ అయ్యింది. అయితే పెళ్లి తరువాత నుంచి ప్రియ వివాదాలను ఎదుర్కొంటూనే ఉంది. ముస్తఫాకు అంతకు ముందే పెళ్లి అవ్వడం, అతని మొదటి భార్య, ప్రియమణిపై నిందలు వేయడం, విమర్శించడం జరిగాయి. అయినా అవేమి పట్టించుకోని ఈ బ్యూటీ భర్తతో కలిసి సంతోషంగా జీవిస్తోంది.
, ఇక టీవీ ఛానెల్ లో డ్యాన్స్ షోకు జడ్జిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయని, అవి పీక్స్ కు వెళ్లడంతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విబేధాలు కూడా ముస్తఫా మొదటి భార్య వలనే అని టాక్.. అయితే ప్రియమణి సన్నిహిత వర్గాలు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. ప్రియ, ముస్తఫా జంట ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఇటీవల బాలీవుడ్ పార్టీలో కూడా భర్తతో కలిసి ప్రియమణి అటెండ్ అయ్యిందని, ఈ వార్తలన్నీ పుకార్లన్నీ చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఏది నిజమో అనేది తెలియాలంటే ప్రియమణి నోరు విప్పాల్సిందే.