Indraja: మహిళలు ఆకాశంలో సగం అని ఎంతో కాలంగా వింటూనే ఉన్నాం. కానీ ఆచరణలో మాత్రం శూన్యం. ఏ రంగంలో చూసినా మహిళలు వెనకబడే ఉన్నారు. అలానే వాళ్ళ వ్యక్తిగత అవసరాలను తీర్చే వస్తువులను అందించే విషయంలోనూ చాలా కాలంగా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. దానికి సురభి హైజిన్ సంస్థ సీఈఓ రాజు బిల్లా, ఆయన శ్రీమతి నిర్మల బిల్లా చెక్ పెట్టాలనుకున్నారు. మహిళల అవసరాలను తీర్చే ప్రాడక్ట్స్ ను, వారి రక్షణకు ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ సంస్థ తాజాగా మూడు ప్రాడక్ట్స్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. వాటిని ప్రముఖ సినీ నటి ఇంద్రజ లాంచ్ చేశారు. అవి సురభి శానిటరీ నాప్కీన్స్, గ్రో ఉమెన్ మెన్‌స్ట్రుయల్ కప్, ఐయామ్ అలర్ట్ పెప్పర్ స్ప్రె! ఇందులో మొదటి రెండు ఉత్పత్తులు మహిళలకు ఋతుచక్ర సమయంలో ఉపయోగపడేవి. బజారులో దొరికే మామూలు ఉత్పత్తులకు భిన్నంగా మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని తయారు చేస్తోంది సురభి హైజిన్ సంస్థ.
ఇవాళ మహిళలకు సమాజంలో రక్షణ కరువైన విషయం అందరూ అంగీకరించేదే. అందుకే ఒంటరిగా ప్రయాణించే మహిళలు తమను తాము రక్షించుకోవడానికి పెప్పర్ స్ప్రేను కూడా హ్యాండ్ బ్యాగ్స్ లో క్యారీ చేయమని కొందరు సలహా ఇస్తున్నారు. అందుకోసం ‘ఐ యామ్ ఎలర్ట్ పెప్పర్ స్ప్రే’ అనే ప్రాడక్ట్ ను కూడా సురభి హైజిన్ లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ, ”మహిళలకు ఉపయోగపడే ఈ ఉత్పత్తులను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చిన సురభి వారికి ధన్యవాదాలు. సురభి హైజీన్ ప్రొడక్ట్స్ ను సులభంగా ఆన్ లైన్ లోనూ పొందే అవకాశాన్ని వీరు కల్పిస్తున్నారు” అని చెప్పారు.