Malla Reddy: మల్లారెడ్డి మాటలకు హర్టయిన బాలీవుడ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malla Reddy Speech Targeting Ranbir Kapoor Became Hot Topic: టీడీపీ నుంచి ఎంపీ అయి తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నారు చామకూర మల్లారెడ్డి. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఆయన ఏం మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా జరిగిన యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ఆయన అత్యుత్సాహంతో మాట్లాడిన మాటలు బాలీవుడ్ అభిమానులకు కోపం తెప్పించేలా ఉన్నాయి. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో యానిమల్ అనే సినిమా తెరకెక్కింది. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న దేశవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో హీరో హీరోయిన్లతో పాటు రాజమౌళి, మహేష్ బాబుతో పాటు సినిమా యూనిట్, అలాగే మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనవసరమైన, ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేయడం ఒక వివాదానికి కారణమైంది. ఆయన త్వరలో ఎన్నికలు ఉన్న క్రమంలో ఈ మాటలు తన రాజకీయ ఎజెండా కోసం చేసి ఉండవచ్చు కానీ ఆ మాటలు బాలీవుడ్ అభిమానులకు కోపం తెప్పించడమే కాదు తెలుగు వారికి సైతం ఇలా మాట్లాడి ఉండకూడదు ఏమో అనిపించేలా చేసింది.
Amma Nana O Tamila Ammayi : రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్ రాబోతుందా..?
Also Read
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
ఈ ఈవెంట్ సమయంలో బాలీవుడ్ టీమ్‌కు ఘనస్వాగతం లభించగా, బీఆర్‌ఎస్ మంత్రి చామకూర మల్లా రెడ్డి స్టేజ్‌పై రణబీర్ కపూర్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇబ్బందికరం అనిపించింది. మల్లా రెడ్డి తనదైన స్టైల్ లో బిగ్గరగా మాట్లాడుతూ “వినండి మిస్టర్ రణబీర్ కపూర్.. ఐదేళ్లలోపు. హాలీవుడ్ బాలీవుడ్ ని తెలుగు వాళ్ళు శాసిస్తారు, మీరు కూడా ఒక సంవత్సరం తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే ముంబై పాతబడిపోయింది, బెంగళూరులో ట్రాఫిక్ జామ్.. భారతదేశంలో హైదరాబాద్ నగరం మాత్రమే ఇప్పుడు ఏకైక ఆప్షన్. రాజమౌళి, దిల్ రాజు చాలా తెలివైన వ్యక్తులు..ఇప్పుడు సందీప్ కూడా వాళ్లకి తోడయ్యాడు. హైదరాబాద్ టాప్ మోస్ట్ హై, తెలుగు వాళ్ళు అందరూ చాలా స్మార్ట్ గా ఉంటారు.. మన హీరోయిన్ రష్మిక కూడా స్మార్ట్. ఆమె నటించిన పుష్ప సంచలనం సృష్టించింది. ఇక్కడ కొన్నేళ్ల క్రితం అశ్వమేధ యాగం చేశాం, ఈ భూమి మంచిది, మల్లా రెడ్డి యూనివర్సిటీ భూమిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడంతో మీ యానిమల్ సినిమా 500 కోట్లు వసూలు చేస్తుందని చెప్పుకొచ్చారు.
అయితే మల్లారెడ్డి మాట్లాడిన వాటిలో కొన్ని నిజాలు లేకపోలేదు కానీ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాదు వచ్చిన ఒక టాప్ బాలీవుడ్ హీరోని మీ బాలీవుడ్ నథింగ్, మేమే తోపులం, మా తర్వాతే ఎవరైనా, మీరు కూడా ఇక్కడకి రావాల్సిందే అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మల్లా రెడ్డి స్పీచ్ విని తెలుగు ఇండస్ట్రీ సినిమాల పట్ల ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే బాలీవుడ్ అభిమానులకి కోపం రావడం చాలా సహజం. దీంతో అభిమానుల స్పందన కూడా ఇప్పుడు కాస్త నెగటివ్ గానే కనిపిస్తోంది. నిజానికి ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు మల్లా రెడ్డికి ఎటువంటి దురుద్దేశాలు లేకపోవచ్చు, కానీ ఇలా రణబీర్ పేరు ప్రస్తావిస్తూ తెలుగోళ్లు తోపులు, మిగతావారంతా డమ్మీ అని అర్ధం వచ్చేలా చేసిన ఈ స్పీచ్ లేనిపోని ప్రాంతీయ వాదాలకు దారి తీస్తుంది. ఒకరకంగా నిజమైన పాన్-ఇండియా చిత్రాలను రూపొందించడానికి భారీ ప్రయత్నాలు జరుగుతున్న ఈ సమయంలో సినిమా ఇండస్ట్రీ వాళ్లంతా నార్త్ లేదు సౌత్ లేదు ఇప్పుడు ఇండియన్ సినిమా ఒక్కటే అంటుంటే, మల్లా రెడ్డి చాలా డిఫరెంట్ గా సౌత్, అందులోనూ మన తెలుగోళ్లు తోపులు అని మాట్లాడడం నష్టం కలిగించే అంశమే. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రేక్షకులు మల్లారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?