Rajendra Prasad : నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారాడు. ఈ నడుమ ఏ స్టేజిపై మాట్లాడినా.. ఎవరో ఒకరిపై నోరు జారుతూ బూతులు తిట్టేస్తున్నాడు. తాజాగా నటుడు అలీని అందరి ముందే తిట్టేశాడు. తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు రాజేంద్ర ప్రసాద్ వెళ్లారు. ఆయన మైక్ అందుకుంటూనే దురుసుగా మాట్లాడాడు.
Read Also : Nara RohitH : నా పెళ్లి అప్పుడే.. నారా రోహిత్ క్లారిటీ..
‘మీరంతా వస్తున్నారని నాకు చెప్పలేదు. రాకుంటే మిస్ అయ్యేవాడిని. ఏరా అచ్చెన్నా.. మనం ఇద్దరం బయటకు వెళ్లాక నీ సంగతి చెప్తా.. ఇది మా ఇద్దరికీ అలవాటే.. అలీ గాడు ఎక్కడున్నాడు లం* కొడుకు.. ఇలా మనకు ఇదంతా కామన్.. నేను నిన్న ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వెళ్లాను. ఏంటీ మీరు చప్పట్లు కొట్టరా.. ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వెళ్తే కొట్టరా.. బ్రెయిన్ పోయిందా మీ అందరికీ.. నేను అడిగి మరీ కొట్టించుకోవడం ఏంటన్నయ్యా.. కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్టు’ అంటూ అత్యంత అసభ్యకరంగా మాట్లాడాడు రాజేంద్ర ప్రసాద్.
ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఆయన్ను తిట్టి పోస్తున్నారు. మొన్న రాబిన్ హుడ్ ఈవెంట్ లో కూడా డేవిడ్ వార్నర్ ను పట్టుకుని దొంగ ముం* కొడుకు అంటూ బూతులు తిట్టాడు. దానిపై దారుణమైన విమర్శలు రావడంతో చివరకు సారీ చెప్పాడు. ఇప్పుడు అలీని అందరి ముందే ఘోరమైన మాట అనేశాడు. ఈ నడుమ రాజేంద్ర ప్రసాద్ ఇలా వేదికలపై నోరు జారుతూ విమర్శల పాలు అవుతున్నాడు. మరి దీనిపై ఏదైనా వివరణ ఇస్తాడో లేదా చూడాలి.
Read Also : Ali : కమెడియన్ అలీకి చిరంజీవి స్పెషల్ గిఫ్ట్..