Nasser: ప్రముఖ నటుడు నాజర్ తీవ్ర గాయాలపాలయ్యారు. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో జరుగుతున్న షూటింగ్ లో ఆయన కు గాయాలు అయ్యినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాజర్.. కోలీవుడ్ హీరో శింబు, మెహరీన్ కలిసి నటిస్తున్న చిత్రాల్లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సుహాసిని మణిరత్నం ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ నేడు హైదరాబాద్ పోలీస్ అకాడమీలో జరుగుతోంది. ఇక ఈ సెట్ లో నాజర్ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన షాట్ కు వెళ్లే హడావిడిలో మెట్లు దిగుతుండగా కాలుజారి కిందపడినట్లు సమాచారం. దీంతో వెంటనే నాజర్ ను చిత్ర బృందం పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
మైనర్ ఇంజ్యూర్ అని, కొన్నిరోజులు రెస్ట్ తీసుకొంటే సరిపోతుందని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాజర్ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇటీవలే నాజర్ తన యాక్టింగ్ కు బ్రేక్ చెప్పాలనుకున్నాడని, ఆయన ఆరోగ్యం దృష్ట్యా కుటుంబ సభ్యులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈలోపే ఈ ఘటన జరగడం విచారకరమని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. మరి ఈ ఘటన తర్వాత ఆయన సినిమాలకు గుడ్ బై చెప్తారా..? లేదా..? అనేది చూడాలి.