పద్మ అవార్డు దుష్ప్రభావమా?… కంగనాపై సీనియర్ నటుడి కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల పద్మశ్రీ అవార్డును అందుకున్న తరువాత స్వాతంత్య్రం ‘భిక్ష’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె కామెంట్స్ పై తీవ్ర దుమారం రేగింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ విషయంలో కంగనాపై ఫైర్ అయ్యారు. అలాగే కంగనాపై హైదరాబాద్ తో పాటు పలు చోట్ల కేసుకు కూడా నమోదు అయ్యాయి. ఈ వివాదం ఇంకా చల్లారలేదు. తాజాగా కంగనా స్వాతంత్య్రం భిక్ష అంటూ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా స్పందించారు. కంగనా ఇచ్చిన స్టేట్మెంట్ హాస్యాస్పదంగా, చిన్న పిల్లల చేష్టల్లా ఉందని పేర్కొన్నాడు. ఇది అజ్ఞానాన్ని ప్రతిబింబిస్తుందా లేదా పద్మ అవార్డు దుష్ప్రభావమా ? అని ఆయన ప్రశ్నించారు.
Read also : శవ పేటికలో ఎలిమినేషన్ ఏంటి ? ‘బిగ్ బాస్’పై నెటిజన్లు ఫైర్
Also Read
- Prabhas 'Fauzi : 'ఫౌజీ' పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
- The PARADISE : 'ది ప్యారడైజ్' ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
ముఖేష్ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు ఓ పోస్టును పంచుకున్నారు. అందులో కంగనా ఫోటోను షేర్ చేస్తూ “దేశ స్వాతంత్ర్యంపై మీరు చేసిన వ్యంగ్యంపై వ్యాఖ్యానించలేదని చాలా మంది నన్ను పదే పదే అడుగుతున్నారు. నా ప్రకారం ఈ ప్రకటన చిన్నపిల్లల చేష్టల్లా, హాస్యాస్పదంగా ఉంది. ఇది ముఖస్తుతి. ఇది అజ్ఞానానికి నిదర్శనమా లేక పద్మ అవార్డు దుష్ప్రభావమా? నాకు తెలియదు. కానీ అందరికీ తెలుసు మన దేశం 1947 ఆగస్టు 15న స్వతంత్రం పొందిందని. దీనికి భిన్నంగా కామెంట్స్ చేయడానికి ప్రయత్నించడం మూర్ఖత్వమే. దే హమే ఆజాదీ బినా ఖడగ్ బినా ధాల్, సబర్మతీ కే సంతే ట్యూనే కర్ దియా కమల్.. పైన పేర్కొన్న ప్రకటన వాస్తవికతకు దూరంగా ఉంది. వాస్తవం ఏమిటంటే ఎవరైనా బ్రిటిష్ ప్రభుత్వం మనస్సులో పారిపోవాలనే భయాన్ని సృష్టించింది అంటే అది దేశంలోని అసంఖ్యాక విప్లవకారుల త్యాగం, సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్, ఆయన స్వంత సైనికుల తిరుగుబాటు భయం” అంటూ కంగనాకు విమర్శించారు.
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!