శవ పేటికలో ఎలిమినేషన్ ఏంటి ? ‘బిగ్ బాస్’పై నెటిజన్లు ఫైర్

బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అన్ని భాషల్లోనూ విశేష ఆదరణతో దూసుకెళ్తోంది. అయితే ఇందులో ఉండే ఎలిమినేషన్ ప్రక్రియ అన్నింటికంటే ఆసక్తికరం. వారానికి ఓ వ్యక్తి హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతారు. అలా వాళ్ళను ఎలిమినేట్ చేయడం కోసం ‘బిగ్ బాస్’ అనుసరించే ప్రక్రియ ఆసక్తికరం. అయితే ఈసారి మాత్రం ఎలిమినేషన్ ప్రక్రియ మరింత కొత్తగా భావించాడు బిగ్ బాస్. అందుకే కొత్త ప్రోమోలో ఇంటి సభ్యులను ఎలిమినేట్ చేయడానికి తాను వేసిన కొత్త పథకాన్ని వెల్లడించాడు. అయితే ఈ ప్రక్రియపై బిగ్ బాస్ అనుకున్న స్పందన మాత్రం రాలేదు. అసలేం చేస్తున్నారో అర్థమవుతుందా ? అంటూ నెటిజన్లు ‘బిగ్ బాస్’పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదంతా తెలుగులో ప్రసారం అవుతున్న “బిగ్ బాస్ 5” గురించి కాదు… హిందీ బిగ్ బాస్ గురించి.

Read Also : “జెర్సీ” హిందీ ట్రైలర్… ఇది షాహిద్ టైం !

మంగళవారం బిగ్ బాస్ 15 కొత్త ప్రోమోలో బిగ్ బాస్ తరువాత ఎలిమినేట్ అయ్యే పోటీదారులను శవపేటికలో ఇంటి నుండి బయటకు తీసుకువెళతామని ప్రకటించారు. ప్రోమో రిలీజ్ అయిన దగ్గర నుంచి జనాలు సోషల్ మీడియాలో విమర్శలు కురిపిస్తున్నారు. బిగ్ బాస్ షోను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఎపిసోడ్ నుండి శవపేటిక భాగాన్ని తీసివేయమని మేకర్స్‌ను అభ్యర్థిస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా మందికి సున్నితమైన అంశం. ఈ కఠినమైన కోవిడ్ సమయాలలో వినోదం కోసం శవపేటికను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు నెటిజన్లు.

Related Articles

Latest Articles