నటుడు, “మనం సైతం” ఫౌండర్ కాదంబరి కిరణ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని నేడు మర్యాద పూర్వకంగా కలిశారు. కేసీఆర్ ని తన కుమార్తె వివాహ మహోత్సవానికి రావాల్సిందిగా కిరణ్ కోరారు. కేసీఆర్ ని ఆహ్వానిస్తూ శుభలేఖను అందజేశారు. అనంతరం “మనం సైతం” గురించి కేసీఆర్ కి కిరణ్ వివరించారు. “మనం సైతం” ద్వారా సమాజహితం కొరకు నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించి, ఆయన ఆశీస్సులను పొందటం జరిగిందని, వివాహానికి తప్పకుండ వస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని కిరణ్ తెలిపారు. “మనం సైతం” సేవా సంస్థతో కరోనా సమయంలో ఎంతోమందికి సాయం అందించారు కాదంబరి కిరణ్. పేదవారికి ఎటువంటి ఆపద వచ్చినా తమ సేవ సంస్థ ద్వారా తమకు తోచిన సాయం చేస్తామని కిరణ్ తెలిపారు.