ప్రముఖ నటులు, ‘మనం సైతం’ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ కుమార్తె సత్య శ్రీకృతి, ఈశ్వర్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ శంషాబాద్ లోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్సీలు ప్రకాష్ గౌడ్, రామచంద్రరావు, కర్నె ప్రభాకర్, మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు, నటులు నరేష్, బ్రహ్మాజీ, శివాజీ, కృష్ణుడు, సాయి కుమార్, గీత రచయిత చంద్రబోస్, సుచిత్ర దంపతులు,…
నటుడు, “మనం సైతం” ఫౌండర్ కాదంబరి కిరణ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని నేడు మర్యాద పూర్వకంగా కలిశారు. కేసీఆర్ ని తన కుమార్తె వివాహ మహోత్సవానికి రావాల్సిందిగా కిరణ్ కోరారు. కేసీఆర్ ని ఆహ్వానిస్తూ శుభలేఖను అందజేశారు. అనంతరం “మనం సైతం” గురించి కేసీఆర్ కి కిరణ్ వివరించారు. “మనం సైతం” ద్వారా సమాజహితం కొరకు నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించి, ఆయన ఆశీస్సులను పొందటం జరిగిందని, వివాహానికి తప్పకుండ వస్తానని కేసీఆర్…
పేదలను ఆదుకోవడంలో అలుపు లేక శ్రమిస్తున్నారు ‘మనం సైతం’ కాదంబరి కిరణ్. సాటివారికి సాయం చేయడంలో యోధుడై పోరాటం సాగిస్తున్నారు. ఈ సాయం కొన్నిసార్లు తన శక్తికి మించినా వెనకడగు వేయక అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. వేలాది మందికి ప్రత్యక్షంగా మరెన్నో రెట్ల పేదలకు పరోక్షంగా సాయం అందించిన కాదంబరి కిరణ్ తాజాగా ఓ చదువుల తల్లి ఉన్నత విద్య కోసం అండగా నిలబడ్డారు. Read also : వెండితెరపైకి ప్రజానాయకుడు ‘గుమ్మడి నర్సయ్య’ జీవిత చరిత్ర! తేజస్వి…
ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న “మనం సైతం” సేవా సంస్థ మరో మైలురాయి దక్కించుకుంది. సొంత ఆంబులెన్స్ కలిగిన సేవా సంస్థగా ముందడుగు వేసింది. ఈ ఉచిత ఆంబులెన్స్ సేవల ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ డీజీ లక్ష్మీ నారాయణ, నిర్మాతలు సి కళ్యాణ్, దర్శకుడు వివి వినాయక్, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు, నటి సన తదితరులు పాల్గొన్నారు. కాదంబరి…
చిత్రపురి కాలనీలో కొవిడ్ బారినపడిన వారికి ఆత్మస్థైర్యాన్ని అందిస్తోంది కాదంబరి కిరణ్ “మనం సైతం” సేవా సంస్థ. అక్కడి కరోనా బాధితులకు ప్రతి రోజూ ఆహారం, ఆక్సీజెన్ సిలిండర్లు, ఆక్సీజెన్ కాన్సెన్ట్రేటర్, మందుల కిట్, పీపీఈ కిట్లు, మాస్క్ లు, శానిటైజర్, ఇమ్మ్యూనిటి పౌడర్, పళ్ళు, డ్రై ఫ్రూట్స్, ఆక్సీమీటర్లు, థర్మామీటర్లు, ఇంజెక్షన్లు అందిస్తున్నారు. ఉదయం నుంచే మొదలయ్యే ఈ సేవా కార్యక్రమాలు రాత్రి దాకా కొనసాగుతున్నాయి. బాధితుల అవసరాలు తెలుసుకుని, ‘మనం సైతం’ టీమ్ తక్షణమే…
మానవ సేవే మాధవ సేవ అని బలంగా నమ్మిన కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న “మనం సైతం” కరోనా కష్ట కాలంలో ఎంతోమందిని ఆదుకుంది. ఆపదలో ఉన్న పేదలకు ఆర్థికసాయం అందించే సేవా యజ్ఞం కొనసాగిస్తూనే, నిత్యావసర వస్తువులు వంటివి అందించింది. తాజాగా చిత్రపురి కాలనీ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ పేషెంట్స్ కు అండగా నిలబడేందుకు “మనం సైతం” కాదంబరి కిరణ్ ముందుకొచ్చారు. కోవిడ్ పేషెంట్లకు ఊచితంగా భోజన సదుపాయం, మందుల కిట్, పీపీఈ కిట్,…