Anushka Sharma: బాలీవుడ్ హీరోయిన్, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కోర్టు మెట్లెక్కింది. ట్యాక్స్ రికవరి కోసం సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇటీవల అనుష్కకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ పన్ను ఎగవేత కేసులో అనుష్క నేడు ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను తిరస్కరించాలని కోరుతూ ఆమె కోర్టులో స్వయంగా పిటిషన్ దాఖలు చేసింది. అయితే గతంలో ఒకసారి అనుష్క మీద హైకోర్టు సీరియస్ అయిన విషయం విదితమే.
ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా పిటీషన్ ను దాఖలు చేయడం తాము ఇంతవరకు చూడలేదని, డైరెక్ట్‌గా పిటీషన్ ఎందుకు వేయలేదంటూ అనుష్క లాయర్ పై హైకోర్టు మండిపడింది. దీంతో ఈసారి అనుష్కనే స్వయంగా వచ్చి పిటిషన్ ను దాఖలు చేసింది. నిర్మాతలకు విధిస్తున్న స్లాబుల్లో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఒక నటిగా.. పలు ఈవెంట్లలో, అవార్డు ఫంక్షన్స్ లో కనిపిస్తాను.. దానికే నిర్మాతలకు విధిస్తున్న స్లాబుల్లో తాను కూడా పన్ను చెల్లించమని అడగడం భావ్యం కాదని ఆమె పిటిషన్ లో తెలిపింది. అంతేకాకుండా.. నిర్మాతగా కాకుండా నటులకు వేసే పన్నులను తనకు వేయమని కోరింది. మరి అనుష్క పిటిషన్ పై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.