Actor Ajith Kumar Latest Photo After Hospitalization : తమిళ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అజిత్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వైరల్ అయ్యాయి. తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న అజిత్ కుమార్ ఫుల్ బాడీ చెకప్ పరీక్షల నిమిత్తం కొద్ది రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. దీంతో అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని, దీని కోసం 4 గంటల ఆపరేషన్ చేశారని అప్పుడు ప్రచారం జఱిగింది. అయితే. అజిత్ కుమార్ గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అధికార ప్రతినిధి సురేష్ చంద్ర అన్నారు. అజిత్ చెవి వెనుక చిన్న కణితి ఉందని, దానిని తొలగించేందుకు సర్జరీ చేశామని తెలిపారు. అజిత్ ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Mamitha Baiju: ప్రేమలు ‘రీణు’’తో ప్రేమలో పడ్డారా?.. ఆమె బెస్ట్ మూవీస్ ఇవే!
శస్త్ర చికిత్స అనంతరం అజిత్ కుమార్ ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత అభిమానులకు ఆయన గురించి పెద్దగా తెలియదు. అయితే తాజాగా షాలిని అజిత్‌కుమార్ అజిత్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, అది ఇప్పుడు వైరల్ అవుతోంది. అజిత్‌కుమార్ కుటుంబంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షాలిని మాత్రమే అప్పుడప్పుడు తన భర్త, పిల్లలు, చెల్లెలుతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం అజిత్ విదా ముయార్చి అనే సినిమా చేస్తోన్నాడు. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. చివరిగా తునీవు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్ ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయాడు.