Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత పెరగాలని, కేవలం గ్లామర్ బొమ్మల్లా కాకుండా కథను నడిపించే పవర్ఫుల్ క్యారెక్టర్లు రాయాలని చాలామంది మేధావులు ఇండస్ట్రీ వర్గాలని కోరుతూ ఉంటాయి. కానీ, ప్రాక్టికల్‌గా పరిస్థితి ఎలా ఉందో కళ్లకు కడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు నటుడు అభయ్ నవీన్. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ పై ఒకవైపు దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి సీన్లు ట్రిమ్ చేసినా.. ఇంకా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఓరియెంటేషన్ పై చర్చ సాగుతూనే ఉంది. ఈ తరుణంలోనే అభయ్ నవీన్ షేర్ చేసిన ఈ ఇంటర్నల్ మ్యాటర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
“నాకు అవార్డులు వద్దు.. గ్లామర్ రోల్స్ కావాలి!”
తనకు ఎదురైన మైండ్ బ్లాకింగ్ ఇన్సిడెంట్ గురించి అభయ్ నవీన్ రాస్తూ.. “ఒక నెల కిందట ఒక లీడ్ రోల్ (హీరోయిన్) కోసం నేను ఒక అమ్మాయిని అప్రోచ్ అయ్యాను. ఆమెకు కథ మొత్తం వినిపించాక ఏమన్నదో తెలుసా..? ‘నాకు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసి, అవార్డులు తెచ్చుకోవాలనే ఇంట్రెస్ట్ అస్సలు లేదు. నాకు కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కావాలి’ అని ముఖం మీదే చెప్పేసింది. ఆ మాట వినగానే నాకు దెబ్బకు మైండ్ మింగేసింది” అంటూ తన ఆవేదనను, ఆశ్చర్యాన్ని పంచుకున్నారు. పైకి మాత్రం ‘మంచి ఫిమేల్ క్యారెక్టర్స్ రాయండి’ అని అంటారు కానీ, నిజంగా ఏదైనా మంచి కథ తీసుకొని వారి దగ్గరకు వెళ్తే.. కథ వినడానికి కంటే ముందే ఈ మూడు ప్రశ్నలే అడుగుతారని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
సినిమాలో హీరో ఎవరు? ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ ఎవరు? నా రెమ్యూనరేషన్ ఇంత.. ఇవ్వగలరా? “నేను కలిసిన కొందరు హీరోయిన్లతో జరిగిన మాట ముచ్చట ఇది. పైన చెప్పిన ఆ మూడు విషయాలు (హీరో, ప్రొడ్యూసర్, రెమ్యూనరేషన్) అన్నీ పక్కాగా సెట్ అయిన తర్వాతే.. ఇక తప్పదు కదా అన్నట్లు ఒక ఫార్మాలిటీ కోసం మాత్రమే కథ ఏంటో చెప్పమని అడుగుతారు” అని అభయ్ నవీన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ పాత్ర ట్రాక్ వల్ల నెగెటివిటీ రావడం, దానికి కౌంటర్‌గా అనసూయ లాంటి వాళ్లు ‘క్రియేటివ్ ఫ్రీడమ్ వర్సెస్ సామాజిక బాధ్యత’ అంటూ పోస్ట్‌లు పెడుతున్న టైంలో అభయ్ నవీన్ ఈ విషయాన్ని బయటపెట్టడం పర్ఫెక్ట్ టైమింగ్ అని నెటిజన్లు అంటున్నారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!