కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు వేవ్స్ లోను సినిమా రంగాన్ని ఛిద్రం చేసింది.చిన్న సినిమాల నుంచి భారీ పాన్ ఇండియా సినిమాల వరకు కరోనా దెబ్బకు వాయిదా పడాల్సి వచ్చింది. ఇక చాలామంది నిర్మాతలు ఈ గడ్డుకాలం నుంచి తప్పించుకోవడానికి ఓటీటీ బాట పడితే కొన్ని చిత్రాలు డేర్ చేసి థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. గత కొంత కాలంగా భారీ ప్రాజెక్ట్ ల రిలీజ్ డేట్లపై సందిగ్దత నెలకొన్న…