Kalam : వెండితెరపై మరో సంచలన బయోపిక్ ను చూడబోతున్నాం. అదే మిస్సైల్ మ్యాన్, దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్. ‘కలాం’ పేరుతో ఈ బయోపిక్ ను ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ధనుష్ ఇందులో కలాం పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ అనౌన్స్ చేస్తూ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో అబ్దుల్ కలాం షాడో పిక్ ను అనుబాంబు పేలుతున్న వద్ద డిజైన్ చేసి చూపించారు. ఈ మూవీని అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్, భూషన్ కుమార్, క్రిషాన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Also : MI vs DC: హాఫ్ సెంచరీతో రాణించిన సూర్యకుమార్ యాదవ్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
త్వరలోనే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు. ఇందులో కలాం గారు రామేశ్వరంలో పుట్టినప్పటి నుంచి ఎన్ని ఇబ్బందులు పడి రాష్ట్రపతి వరకు ఎలా ఎదిగారు అనేది సినిమా రూపంలో తీసుకురాబోతున్నారు. ఓం రౌత్ గతంలో ప్రభాస్ తో ఆదిపురుష్ మూవీ తీసిన సంగతి తెలిసిందే. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఆ మూవీ తర్వాత ఓం రౌత్ తీస్తున్న సినిమా ఇదే. ధనుష్ ప్రస్తుతం కుబేర సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ జూన్ లో రిలీజ్ కాబోతోంది. దాని తర్వాత ఈ కలాం సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇండియాకే గర్వకారణమైన అబ్దుల్ కలాం సినిమా కావడంతో దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
Read Also : Delhi: “24 గంటల్లో వెళ్లిపో”.. మరో పాక్ హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన భారత్