Aata Sandeep Supporting Pallavi Prashanth: తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సందీప్ సంచలనం రేపే పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఇంటి సభ్యులను బిగ్ బాస్ రెండుగా విభజించి యావర్, గౌతమ్, తేజ, శోభా శెట్టి, రతికలను ఒక టీంగా శివాజీ, అర్జున్, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, అశ్వినిలను మరొక టీమ్ గా చేశారు. ఇలా టీమ్స్ ను విభజించిన తరువాత జంపింగ్ జపాంగ్ టాస్క్ లో యావర్ టీమ్ గెలిచింది. దీంతో బిగ్ బాస్ ఆ టీమ్ కి ఒక అవకాశం ఇచ్చి ఎదురు టీమ్ నుండి ఒకరిని డెడ్ చేయవచ్చనేలా రూల్ పెట్టాడు. అలా డెడ్ చేసిన సభ్యులు టాస్క్స్ ఆడటానికి లేదన్న మాట. ఈ క్రమంలో గౌతమ్ ప్రత్యర్థి టీమ్ నుండి ప్రశాంత్ ని డెడ్ చేశాడు.
దీంతో పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ టాస్క్స్ ముగిసే వరకు డెడ్ బోర్డు మెడలో వేసుకుని తిరగాల్సిందేనన్నమాట. ఇప్పుడు కెప్టెన్ అయ్యే ఛాన్స్ కూడా అతనికి లేడు. ఈ క్రమంలో సందీప్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంస్టాగ్రామ్ లో స్టోరీ పెట్టి ఓ కామెంట్ పోస్ట్ చేశాడు. పాపంరా పల్లవి ప్రశాంత్, ఒక మంచి ప్లేయర్, వాడిని ఎందుకు డెడ్ చేశారు??. ప్రశాంత్ ఉంటే ఆట ఆడలేరా? భయమా? స్ట్రాంగ్ ప్లేయర్స్ తో ఆడండి, స్ట్రాంగ్ ప్లేయర్స్ ని బయటకు పంపి ఆడితే కిక్కు ఉండదు, అఫ్ కోర్స్ నన్ను కూడా అందుకే బయటకు పంపారు నేను స్ట్రాంగ్ ప్లేయర్ అని అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. సందీప్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన ఎలిమినేషన్ పట్ల అసంతృప్తిగా ఉన్న సందీప్ తన కామెంట్లతో మరో మారు తన బాధను వెళ్లగక్కినట్టు అయింది.