బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ప్రస్తుతం అమిర్ నటించిన లాల్ సింగ్ చద్దా రిలీజ్ కి రెడీ అవుతుండగా.. మరో సినిమాలో అమీర్ నటిస్తున్నాడు. ఇక నేడు అమీర్ తాం 57 వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా అమీర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే సినిమాల్లో పర్ఫెక్ట్ హీరో అనిపించుకున్న ఈ హీరో నిజ జీవితంలో రెండు సార్లు విడాకులు తీసుకున్నాడు. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్నాడు. ఇప్పటివరకు విడాకులపై నోరువిప్పని అమీర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఇద్దరు మాజీ భార్యల గురించి చెప్పుకొచ్చాడు.
” ప్రపంచం దృష్టిలో మేము విడాకులు తీసుకున్నాం.. అది ప్రజలు వేరేలా అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ భార్యాభర్తలైనా విడాకుల తరువాత ఒకరిగురించి ఒకరు పట్టించుకోరు.. కానీ, మేము అలా కాదు. మేము వివాహ వ్యవస్థకు గౌరవం ఇస్తాము. అందుకే విడాకుల ముందే అన్ని చర్చించుకొని విడిపోయాం.. స్నేహితుల్లా ఉండాలనుకున్నాం.. అలాగే ఉంటున్నాం.. ఇప్పటికీ నా ఇద్దరు మాజీ భార్యలతో నేను మాట్లాడతాను. వారితో నాకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉండటం నా అదృష్టం. పిల్లల బాధ్యతలోనూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటాం” అని చెప్పుకొచ్చాడు. కాగా అమీర్ .. 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. కొన్ని విభేదాల కారణంగా 2002 లో రీనాకు విడాకులిచ్చాడు అమీర్.. ఆ తరువాత 2005లో ఆమీర్ ఖాన్ కిరణ్ రావును పెళ్లాడారు. 15ఏళ్ల వైవాహిక బంధం అనంతరం ఈ జంట విడిపోయిన సంగతి తెలిసిందే.