Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేసిన తాజా కామెంట్లు ఆసక్తిని రేపుతున్నాయి. ఒక హీరో తన సినిమా పెద్ద హిట్ అయితే కచ్చితంగా సంతోషిస్తాడు. సెలబ్రేట్ చేసుకుంటాడు కదా. కానీ అమీర్ ఖాన్ తన పీకే సినిమా అంత పెద్ద హిట్ అయినా సరే అస్సలు సంతోషించలేదంట. కనీసం సెలబ్రేట్ కూడా చేసుకోలేదని చెప్తున్నాడు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో వచ్చిన పీకే సినిమాలో అమీర్ ఖాన్, అనుష్కశర్మ జంటగా నటించారు. 2014లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టింది. అప్పట్లోనే రూ.800 కోట్లు వసూలు చేసింది. అంత విజయం సాధించినా అమీర్ హ్యాపీగా లేడని చెప్తున్నాడు.
Read Also : Putin: ట్రంప్ కోసం చర్చిలో పుతిన్ ప్రార్థనలు.. కారణం ఏంటంటే..
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పీకే సినిమా ప్రారంభం కాక ముందు నేను, రాజ్ కుమార్ అనుకున్న కథ వేరే. కానీ చివరి నిముషంలో ఆ కథను మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే క్లైమాక్స్ అలాగే తీస్తే వేరే కథను కాపీ కొట్టినట్టు అవుతుందని అనుకున్నాం. అందుకే ఆ కథ క్లైమాక్స్ ను మార్చి షూటింగ్ చేశాం. ఒకవేళ ముందు అనుకున్న కథనే తీస్తే ఇంకా పెద్ద హిట్ అయి ఉండేదేమో. ఆ అసంతృప్తితోనే సెలబ్రేట్ చేసుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్. పీకే సినిమా అమీర్ కెరీర్ లోనే రెండో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయింది.