‘ప్రేమ కావాలి’ సినిమాతో గ్రాండ్ డెబ్యూ ఇచ్చిన ఆది సాయికుమార్.. చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం పరి తపిస్తున్నాడు. ట్రెండ్‌కి తగ్గట్టు రకరకాల ప్రయోగాలు చేస్తోన్నా, ఏదీ కలిసి రావట్లేదు. అయినా పట్టు వదలకుండా వరుస సినిమాలు చేస్తోన్న ఆది.. ఇప్పుడు ‘తీస్ మాస్ ఖాన్’గా రాబోతున్నాడు. చకచకా పనులు ముగించుకుంటోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఒక నిమిషం 34 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌ని చూస్తుంటే, యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.
‘‘ఆఫీస్‌కు వెళ్లిన మా అన్న తిరిగి రాలేదు.. అసలేం జరుగుతోంది ఇక్కడ.. మనం ఆపాలనుకున్న పవర్ మన దగ్గరున్నా, మనం ఆపలేనంత పవర్ వాడిదగ్గరుంది సర్.. రాక్షసుడికి రక్షకుడంటే ఏంటో చూపించండి’’ అంటూ సాగే డైలాగ్స్‌తో మొదలయ్యే ఈ టీజర్‌లో యాక్షన్‌తో పాటు హీరో-హీరోయిన్ల రొమాంటిక్ షాట్స్‌ని కూడా చూపించారు. పోలీసులకు చిక్కకుండా నేరాలకు పాల్పడే ఓ కరుడుగట్టిన విలన్, రౌడీ పోలీస్ గెటప్‌లో అల్లరి చేసే హీరో మధ్య సాగే పోరాటమే ఈ సినిమా నేపథ్యమని అర్థమవుతోంది. ఇందులో ఆది సాయికుమార్ కొంచెం డిఫరెంట్‌గా కనిపించడంతో పాటు ఆ క్యారెక్టర్‌లోనూ పూర్తిగా ఒదిగిపోయినట్టు కనిపిస్తున్నాడు.
ఇక మన పాయల్ రాజ్‌పుత్ ఎప్పట్లాగే ఇందులోనూ అందాల్ని బాగానే ఆరబోసింది. ముఖ్యంగా బీచ్ వద్ద పాయల్ కాస్త రెచ్చిపోయిందనే చెప్పుకోవాలి. హీరో-హీరోయిన్ల మధ్య ఘాటు రొమాన్స్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్‌గా చూసుకుంటే, టీజర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్‌గానే ఉంది. మరి, ఈ సినిమా అయితే ఆదిని గట్టెక్కిస్తుందా? లేదా? అనేది చూడాలి. ‘నాటకం’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు సాధించిన కళ్యాణ్ జీ గోగణ ఈ సినిమాకి దర్శకుడు. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. సునీల్, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.