కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరక్కేక్కిన కెజిఎగ్ చిత్రం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో పతత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో సినీ ప్రేక్షకులను మెప్పించి హీరో యష్ ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది. ఇక ప్రస్తుతం అభిమానులందరూ కేఈజిఎఫ్ పార్ట్ 2 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇపప్టికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ రికార్డులు సృష్టించాయి. ఇటీవలే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులనుజరుపుకుంటుంది.
ఇక తాజాగా ఈ సినిమా గురించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో ఒక వింటేజ్ సూపర్ హిట్ ట్రాక్ ని రీమిక్స్ చేస్తున్నారట.. ఆ సాంగ్ ఏంటంటే.. బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కలిసి నటించిన ‘షోలే’ చిత్రంలోని మెహబూబా.. మెహబూబా సొంగ ని ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారట మేకర్స్. ఇక ఈ సాంగ్ షూట్ కూడా హైదరాబాద్ లోనే జరిపినట్లు సమాచారం. అప్పట్లో అభిమానులందరినీ ఒక ఊపు ఊపిన ఐటెం సాంగ్ మెహబూబా.. మెహబూబా.. ఇప్పటికి ఏదో ఒక పార్టీలో ఈ సాంగ్ వినపడుతూనే ఉంది. ఇక ఈ సాంగ్ ని యష్ చేత రీమిక్స్ చేయించాడట ప్రశాంత్.. అయితే యష్ తో కలిసి ఆడిపాడిన ఆ హాట్ బ్యూటీ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సాంగ్ కేవలం హిందీ వరకే పరిమితమా.. లేక అన్ని భాషల్లోనూ ఈ సాంగే ఉంటుందా అని తెలియాల్సి ఉంది.