గేమ్ ఛేంజర్ మిశ్రమ ఫలితం రాబట్టిన డీలా పడకుండా ఈ సారి ఎలగైన హిట్ కొట్టాలని కసి తో ఉన్నాడు రామ్ చరణ్. ఆ కోవలోనే యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు కు ఛాన్స్ ఇచ్చాడు. చెర్రీ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్నఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్‌లో చేస్తున్నాడు. ఇటీవల ఓ షెడ్యూల్ కూడా ఫినిష్ చేసాడు చరణ్. నైట్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్ర యూనిట్.
Also Read : Suriya : బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా
వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లోను ఆర్సీ 16కి సంబంధించిన వర్క్ మొత్తం ఆగస్టు లోపు ఫినిష్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారట. ఇప్పటివరకు జెట్ స్పీడ్ లో జరిగిన ఈ సినిమా షూట్ కు తాజాగా కాస్త విరామం ప్రకటించారు. తరువాత షెడ్యూల్ లో కిలక సన్నివేశాలు షూట్ చేయనున్నారు. అందుకు సంబందించిన సెట్ వర్క్ లు జరుగుతున్నాయి. అతి త్వరలో తిరిగి మళ్లీ షూట్ ప్రారంభం అవుతుంది. కాగా ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ అని పలు రకాల పేర్లు వినిపిస్తుండగా అవేవి నిజం కాదని యూనిట్ సభ్యులు తెలిపారు. అసలు వర్కింగ్ టైటిల్ కాదు, ఇంకా ఏ టైటిల్ కూడా అస్సలు ఇంకా ఫిక్స్ కాలేదని కానీ చాలా టైటిళ్లు ఆలోచించి పెట్టారు. వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేస్తారని వెల్లడించారు. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తో పాటు వృద్ధి సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.