తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. ఇంకా చెప్పాలి అంటే తమిళ్ కంటే ఎక్కువ తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఉన్నాయి. సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ గతేడాది రీరిలీజ్ చేయగా సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే సూర్య స్ట్రయిట్ తెలుగు ఎప్పుడు చేస్తాడా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. సూర్య కూడా త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని కంగువ ప్రమోషన్స్ లో తెలిపాడు.
మొత్తానికి ఆ టైమ్ రానే వచ్చింది. అవును సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సూర్య ను డైరెక్ట్ చేయబోయేది ఎవరో కాదు యంగ్ టాలెంట్ వెంకీ అట్లూరి. సార్, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్స్ తో వెంకీ అట్లూరి క్రేజ్ మారిపోయింది. ఇప్పటికే ధనుష్ ను తెలుగులో పరిచయం చేసి సూపర్ హిట్ ఇచ్చాడు వెంకీ. ఇప్పుడు సూర్యను తీసుకు రాబోతున్నాడు. ఇటీవల సూర్య ను కలిసి కథ కూడా వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూర్య. అలాగే సూర్య సరసన హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ భామ భాగ్యశ్రీ బోర్స్ ను కూడా ఫిక్స్ చేసారు మేకర్స్. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ డైరక్షన్ లో సూర్య చేస్తున్న రెట్రో ఫినిష్ చేసాక వెంకీ అట్లూరి సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు సూర్య. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తుండగా వెంకీ అట్లూరి సినిమాలకు రెగ్యులర్ గా సంగీతం అందించే జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.