బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘సత్య ప్రేమ్ కి కథ’. సమీర్ విద్వాన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్యూర్ లవ్ స్టోరీలో సత్యప్రేమ్ గా కార్తీక్ ఆర్యన్, కథగా కియారా అద్వానీ నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి భూల్ భులాయ్యా 2లో నటించారు, ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో కార్తీక్ ఆర్యన్-కియారా అద్వానీ కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. సత్యప్రేమ్ కి కథ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచాయి. జూన్ 29న ఆడియన్స్ ముందుకి రానున్న సత్యప్రేమ్ కి కథ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతూ మేకర్స్ ‘పసూరి ను’ అనే సాంగ్ ని రిలీజ్ చేసారు. ‘పసూరి ను’ అనే సాంగ్ పేరు వినగానే అందరికి కోక్ స్టూడియో ప్రొడ్యూస్ చేసిన పాకిస్థానీ సాంగ్ గుర్తు రావడం గ్యారెంటీ. అలీ సేథ్, షే గిల్ కలిసి పాడిన పసూరి సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. పాకిస్థాన్ బౌండరీలు దాటి పసూరి సాంగ్ వరల్డ్ వైడ్ మ్యూజిక్ లవర్స్ అందరికీ చేరువయ్యింది.
ఈ సాంగ్ కి ఇండియాలో కూడా సూపర్బ్ ఫ్యాన్ బేస్ ఉంది, ఇంత పెద్ద హిట్ సాంగ్ ని ఇప్పుడు సత్యప్రేమ్ కి కథ సినిమాలో పెట్టారు. మేకర్స్ ఈ సాంగ్ ని రిలీజ్ చేసారు కానీ ఒరిజినల్ సాంగ్ లో ఉన్న మ్యాజిక్ హిందీ పాటలో మిస్ అయ్యింది. మ్యూజిక్ అండ్ లిరిక్స్ ని ఒరిజినల్ సాంగ్ రాసిన అలీ సేథ్ స్వయంగా రాసినా కూడా హిందీలో మాత్రం ‘పసూరి ను’ సాంగ్ ఆకట్టుకోలేక పోయింది. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ ఈ సాంగ్ ని డాన్స్ చేస్తున్నా కూడా సాంగ్ వింటున్న వాళ్లకి ఒరిజినల్ సాంగ్ విజువల్స్ కనిపించడం గ్యారెంటీ. అందుకే అంటారు ఎప్పుడో ఒకసారి జరిగే దాన్నే అద్భుతం అంటారు… ఎప్పుడూ జరిగితే అది అద్భుతం ఎందుకు అవుతుంది. ఈ విషయాన్ని సత్యప్రేమ్ కి కథ మేకర్స్ తెలిసుకోలేకపోయినట్లు ఉన్నారు.
Aa chale, leke tujhe.. Hain Jaha Silsile… Feel The Magic of Love with Arijit Singh’s Midas Touch!#PasooriNu Song Out Now🤍 https://t.co/r428iSQ4qT#SajidNadiadwala #SatyaPremKiKatha #29thJune @advani_kiara @sameervidwans @shareenmantri @kishorarora19 @karandontsharma… pic.twitter.com/NXVpxbhk9C
— Kartik Aaryan (@TheAaryanKartik) June 26, 2023