రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికలు రిలేషన్ లో ఉన్నారు అనే వార్త కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. ఈ ఇద్దరూ కలిసి గీత గోవిందం సినిమాలో నటించినప్పటి నుంచి, ఈ ప్రేమ వార్త వినిపించడం మొదలయ్యింది. అయితే ఇంట్లో వాళ్లతో గడపడానికే సమయం లేదు ఇంకా ప్రేమకి టైం ఎక్కడ ఉంది అంటూ రష్మిక స్టేట్మెంట్ ఇచ్చింది కానీ దాన్ని ఎవరూ నమ్మలేదు అనుకోండి. ఎప్పటికప్పుడు విజయ్ దేవరకొండ, రష్మికలు ప్రేమలో ఉన్నారు అనే వార్త కొత్త విషయంతో లింకప్ అయ్యి వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి వార్తే ఒకటి బయటకి వచ్చింది. విజయ్ దేవరకొండ ఒక స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫోటోని పోస్ట్ చేసి, అందరికీ న్యూ ఇయర్ విషెస్ ని చెప్పాడు. విజయ్ పోస్ట్ చేసిన పావుగంటలో రష్మిక కూడా ఒక ఫోటోని పెట్టి ‘హలో 2023’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండ, రష్మికలు ప్రేమలో ఉన్నారు అనే న్యూస్ మళ్లీ వినిపించడం మొదలయ్యింది.
విజయ్ పోస్ట్ చేసిన ఫోటో కూడా ఈ పుకార్లకి కారణం అయ్యింది. విజయ్ దేవరకొండ స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్న ఈ ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో ఒక ‘హట్’ ఉంది. ఇదే ‘హట్’ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ఫోటో ఒకదాన్ని దాదాపు పదకొండు నెలల క్రితం రష్మిక తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ నెలలో… ‘మాల్దీవ్స్’ లోని ‘ఒజేన్ రిజర్వ్ బోలిఫుషి’ అనే రిసార్ట్ నుంచి రష్మిక, తన ఫోటోని పోస్ట్ చేసింది. అప్పట్లో విజయ్ దేవరకొండ, రష్మికలు కలిసే ట్రిప్ వెళ్లారు అనే రూమర్ కూడా వినిపించింది. ఇప్పుడు అదే రూమర్ ని విజయ్ దేవరకొండ-రష్మికల ఫోటోల్లో ఉన్న ‘హట్’ నిజం చేసింది. మరి ఇప్పటికైనా విజయ్ దేవరకొండ, రష్మికలు ప్రేమలో ఉన్నామనో… డేటింగ్ చేస్తున్నమానో ఓపెన్ అవుతారా లేదా ఎప్పటిలాగే సీక్రెట్ గా తమ రిలేషన్షిప్ ని మైంటైన్ చేస్తారా అనేది చూడాలి.