Sitara Ghattamaneni: బ్రేకింగ్.. సితార పేరుతో ఫ్రాడ్.. మాదాపూర్ లో కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sitara Ghattamaneni: సోషల్ మీడియా వచ్చాకా ఆన్లైన్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కేటుగాళ్లు డబ్బులు గుంజుతున్నారు. సోషల్ మీడియా అధికారిక అకౌంట్స్ ను హ్యాక్ చేసి.. కొన్ని లింక్స్ పంపించి వాటిని సెలబ్రిటీలే క్లిక్ చేసుకోమని చెప్పినట్లు చూపించి ప్రజలవద్ద నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇక తాజాగా ఈ కేటుగాళ్లు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటివరకు వచ్చారు. మహేష్ ముద్దుల తనయ సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సితార ఫోటో పెట్టి, ఆమె పేరుతో కొంతమంది కేటుగాళ్లు ఇన్స్టాగ్రామ్ లో ట్రేడింగ్ మరియు పెట్టుబడి లింక్‌లను పంపుతున్నారు. ఇది గమనించిన మహేష్ బాబు కుటుంబం మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. ఇలాంటి లింక్స్ ఏవి సితార పంపలేదని, ఇలాంటి లింక్స్ ను ఓపెన్ చేయొద్దని టీమ్ GMB ట్విట్టర్ వేదికగా అభిమానులను కోరింది.
“మాదాపూర్ పోలీసులు మరియు టీమ్ GMB చెప్పేది ఏంటంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో సితార ఘట్టమనేని వేషధారణతో కూడిన సైబర్ క్రైమ్ సంఘటన గురించి హెచ్చరిక జారీ చేశారు. గుర్తుతెలియని వినియోగదారుడు ఘట్టమనేని సితార పేరుతో మోసపూరితంగా.. గుర్తుతెలియని వారికి ట్రేడింగ్ మరియు పెట్టుబడి లింక్‌లను పంపుతున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నిరోధించడానికి ఈ కార్యకలాపాలకు కారణమైన వ్యక్తిని గుర్తించి, పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్థిక సలహాలను అడిగేముందు సెలబ్రిటీ ఖాతాల ప్రామాణికతను(బ్లూ టిక్) ధృవీకరించుకోవాలని ప్రజలకు సూచించారు”. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
- Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
Attention! pic.twitter.com/6tX9yNQT5G
— GMB Entertainment (@GMBents) February 9, 2024
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
-
India vs UK Healthcare: ‘భారత్‌లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
-
Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
-
Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన ‘సీక్రెట్ సోల్జర్’
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!