బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్- దీపికా పదుకొనే జంటగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ’83’. భారత మాజీ క్రికెటర్ 1983 ప్రపంచ కప్ విజేత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా హిందీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అనుకోకుండా బరిలోకి దిగి, ఊహించని విధంగా వెస్టిండీస్ మీద ఇండియా గెలిచి వరల్డ్ కప్ కొట్టిన తీరును ఎంతో ఉత్కంఠభరితంగా చూపించారు. ట్రైలర్ ఆద్యంతం గూస్ బంప్స్ ని తెప్పిస్తోంది. ఈ టోర్నీ కోసం మొదటి నుంచి భారత ఆటగాళ్లు ఎదుర్కున్న ఆటంకాలను, అవమానాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.
అందరికి బస్సులు పంపి, టీమిండియా ఆటగాళ్లకు మాత్రం బస్సు లేదు అని చెప్పడం.. అప్పట్లో మన వాళ్ళను ఎంత తేలికగా తీసుకున్నారు అనేదానికి అద్దం పడుతోంది. ఇన్ని అవమానాలు, ఆటంకాల మధ్య టీమ్ ఇండియా ఆటగాళ్లు కసిగా ఆడడం, కపిల్ దేవ్ నేతృత్వంలో 1983 వరల్డ్ కప్ విజేతగా నిలవడం, ప్రపంచ కప్ తో స్వదేశానికి తిరిగి వచ్చిన ఎమోషనల్ జర్నీ, కొన్ని కోట్లమంది భారతీయులు ఆ ఎమోషనల్ మూమెంట్ చూసి సంబురాలు చేసుకోవడం ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇక మరుముఖ్యంగా కపిల్ దేవ్ భార్యగా దీపికా నటన, శ్రీకాంత్ గా జీవా కామెడీ నవ్వులు పూయిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే మిగతా అన్ని భాషల్లోనూ ట్రైలర్ ని రిలీజ్ చేయన్నున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగులో అక్కినేని నాగార్జున ,తమిళ్ లో కమల్ హాసన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, కన్నడలో సుదీప్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మరి ఈ చిత్రంతో మరోసారి క్రికెట్ అభిమానులు ఆ రోజులను గుర్తుచేసుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా దేశవ్యాప్తంగా డిసెంబర్ 24 న విడుదల కానుంది.