7/G Brundavan Colony hero Ravi Krishna transformation: టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సినిమా 7/G బృందావన్ కాలనీ 2004లో విడుదలై సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో ఈ మూవీకి యూత్ కనెక్ట్ అయ్యారు. టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం తనయుడు రవికృష్ణ హీరోగా నటించాడు. ఇందులో రవి కృష్ణ సరసన సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేయగా రెండు భాషల్లో కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది. ఈ సినిమా దాదాపు 19 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ ఇప్పుడు థియేటర్లలోకి వస్తోంది. వచ్చే వారం ఈ సినిమా 4K వెర్షన్ ను రీ-రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా ట్రైలర్ ను లాంచ్ చేశారు.
Singham Again: సింగం వీరులు మళ్ళీ మొదలెట్టారు!
వాస్తవ సంఘటనల ఆధారంగా విభిన్నమైన ప్రేమ కథగా ‘7/G బృందావన్ కాలనీ’ సినిమాను రూపొందించారు దర్శకుడు సెల్వరాఘవన్. బాధ్యతలు లేకుండా అల్లరి చిల్లరిగా, జులాయిగా తిరిగే ఓ యువకుడు ఓ అమ్మాయి ప్రేమలో పడి ఎలా మారాడు? అనేది ఈ సినిమాలో చూపించారు. ‘ఈ వయసులో సిగరెట్లు, బీర్లు, పోలీసులు..’ అంటూ రవికృష్ణను చంద్రమోహన్ తిట్టే సన్నివేశంతో ఈ ‘7/G బృందావన కాలనీ’ రీ రిలీజ్ ట్రైలర్ కట్ మొదలైంది. ఇక ఇప్పటి యూత్ ని ఆకట్టుకునే అంశాలు, సినిమాలో హైలైట్ గా నిలిచిన సీన్స్ తో ఫ్రెష్ ఫీలింగ్ ను కలిగించే విధంగా ట్రైలర్ కట్ చేశారు. మనసుకు హత్తుకునే పాటలను గుర్తు చేయడమే కాదు, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో కంటతడి పెట్టించగా ఈ 4K క్వాలిటీతో మరోసారి మనల్ని 7/G బృందావన్ కాలనీలోకి తీసుకుపోబోతున్నారు. ఇక ఈ రోజు జరిగిన ఈవెంట్ కి సోనియా, ఎఎం రత్నంతో పాటు ఎఎం రత్నం కొడుకు, హీరో రవికృష్ణ కూడా వచ్చాడు. అయితే బాగా బరువు పెరిగిపోయి గుర్తు పట్టడానికి కూడా కష్టం అనిపించేలా మారిపోయాడు.