‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ మేనియా నడుస్తోంది ఇప్పుడు. కొన్నాళ్లుగా ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఇంత క్రేజ్ ఉన్న సినిమా వస్తోందంటే… టికెట్లు ఎలా అమ్ముడవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం KGF 2 టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10వేలకి పైగా స్క్రీన్ లలో ఈరోజు రిలీజ్ కాగా, ఇప్పటికే బుక్ మై షో, పేటీఎమ్ వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో 40 లక్షలకి పైగా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే అమ్ముడు కావడం విశేషం. ‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ మేనియా ఎలా ఉందన్న విషయం ఈ సంఘటన చూస్తే స్పష్టం అవుతుంది.
Read Also : South Cinema : బాలీవుడ్ ను ఆక్రమించేసిన సౌత్… నెల నుంచి మనదే హవా !
‘కేజీఎఫ్- ఛాప్టర్ 1’ కన్నడ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదలై అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగంగా ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు. రాఖీ భాయ్ అభిమానులు థియేటర్లలో ప్రస్తుతం పండగ చేసుకుంటున్నారు. మరి ఈ సినిమా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు కొల్లగొడుతుందా ? లేదా ? అన్నది చూడాలి.