సౌత్ ఇండియన్ స్టార్స్ క్రేజ్ రోజురోజుకూ ఎల్లలు దాటి వ్యాపిస్తోంది. తాజాగా ట్విట్టర్ లో ఈ ఏడాది టాప్ 5 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ లిస్ట్ బయటకు వచ్చింది. ఈ జాబితాలో ‘వకీల్ సాబ్’ కూడా స్థానం దక్కించుకోవడం విశేషం. విజయ్, అజిత్ సినిమాలు మొదటి రెండు స్థానాలను ఆక్రమించుకోగా పవన్ కళ్యాణ్ 5వ స్థానంలో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే టాలీవుడ్ నుంచి టాప్ 5 లో ఉన్నది ‘వకీల్ సాబ్’ మాత్రమే. ఈ లిస్ట్ మొత్తాన్ని కోలీవుడ్ సినిమాలే ఆక్రమించుకోవడం గమనార్హం.
Read Also : రౌద్రం… రణం…రుధిరం… రియల్ మ్యాజిక్ ఆఫ్ రాజమౌళి!
2021లో భారతదేశంలో అత్యధికంగా ట్వీట్ చేసిన చిత్రాలలో విజయ్ ‘మాస్టర్’ మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో మరో కోలీవుడ్ స్టార్ అజిత్ నెక్స్ట్ మూవీ ‘వాలిమై’ ఉంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకపోయినప్పటికీ కేవలం ప్రోమో, మేకింగ్ తోనే ఈ రికార్డును క్రియేట్ చేసింది. విజయ్ ‘బీస్ట్’ కూడా చిత్రీకరణ దశలో ఉన్నప్పటికీ ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. ఇక సూర్య ‘జై భీమ్’ ఈ లిస్ట్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ 4వ స్థానంలో ఉంది. ఇక చివరగా అంటే 5వ స్థానంలో ‘వకీల్ సాబ్’ నిలిచింది. పవన్ మూవీ ఈ సంవత్సరంలో అత్యధికంగా ట్వీట్ చేసిన చలనచిత్రాలలో ఒకటిగా నిలిచింది.