10 telugu movies releasing this weekend: ప్రతి వారంలాగే ఈ వీకెండ్ కూడా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో ఈసారి ఏకంగా తొమ్మిది చిన్న సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. శుక్రవారం విడుదలకు సిద్దమైన కొత్త సినిమాల్లో శివ కందుకూరి హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా తెరకెక్కిన “మను చరిత్ర” మాత్రమే కొంత తెలిసిన ముఖాలు ఉన్నాయి. నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడైన ఆయన “గమనం”, “చూసి చూడగానే”, “మీట్ క్యూట్” వంటి సినిమాల్లో నటించాడు. అంతేకాక “మను చరిత్ర” ట్రైలర్ కూడా కొంత ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రంలో, శివ కందుకూరి మను దుర్గరాజ్‌గా నటించగా టైటిల్ అతని లైఫ్ జర్నీని బట్టి పెట్టినట్టు ప్రమోషన్స్ లో ప్రచారం చేశారు.
Mahi V Raghav: డిస్నీ+ హాట్‌స్టార్ పరువు తీశారంటే.. ‘పంది’తో గొడవ పడలేనంటున్న డైరెక్టర్!
భరత్ పెద్దగాని దర్శకత్వం వహించిన ఈ సినిమా యూత్ ఫుల్ డ్రామాగా తెరకెక్కింది. ఇక ఈ సినిమా కాకుండా సైకలాజికల్ థ్రిల్లర్ “అస్విన్స్” కూడా థియేటర్లలోకి రాబోతోంది. ఇది “అస్విన్స్” పేరుతో ఉన్న తమిళ చిత్రానికి తెలుగు డబ్బింగ్ వెర్షన్. తమిళంలో, ఈ సినిమాకు మంచి రివ్యూలు ఇచ్చారు. ఇక ఈ రోజుల్లో పల్లెటూరి తెలంగాణా కామెడీలు బాగా వర్కౌట్ అవుతున్న క్రమ్మలో అలాంటి తెలంగాణా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన “భీమదేవరపల్లి బ్రాంచ్” కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాలని బరిలోకి దిగుతోంది. ఇవి కాకుండా ఈ వీకెండ్ లో “కుట్ర,” “రాముడు అనుకోలేదు”, “మా అవారా జిందగీ,” “కర్ణ,” “జాగ్రత్త బిడ్డ,”, 1920, “భారీ తారగణం” ఉన్నాయి.