తెలుగు, తమిళ ప్రేక్షకులను తన కామెడీతో ఆకట్టుకున్న పాపులర్ లేడీ కమెడియన్ విద్యుల్లేఖా రామన్ తన ప్రియుణ్ణి పెళ్లాడిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఫిట్‌నెస్ నిపుణులు, న్యూట్రీషియన్ సంజయ్‌తో విద్యుల్లేఖా రామన్ ప్రేమలో ఉండగా.. ఇరు కుటుంబాల అంగీకారంతో సెప్టెంబర్ 9న సంజయ్‌ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లి ఫొటోలు మాత్రం బయటకి రాలేదు. రీసెంట్‌గా తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవుల్లో వెళ్లారు. హనీమూన్ కి సంబంధించిన ఫొటోలు వీడియోలను విద్యుల్లేఖా రామన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేసింది. ‘మాల్దీవుల ప్రదేశం అంటే తనకు ఎంతో ఇష్టమని.. తన హృదయాన్ని తాకిందని’ పోస్ట్ లో రాసుకొచ్చింది. గతేడాదే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకోగా, కరోనా కారణంగా వాయిదా పడింది. లాక్‌డౌన్ సమయంలో విద్యుల్లేఖా బాగా సన్నబడింది.
A post shared by Vidyu Raman (@vidyuraman)