World Heart Day 2024 : యువతలో గుండెపోటు కేసులు ఎందుకు పెరుగుతున్నాయ్?
- పెరుగుతున్న గుండెపోటు కేసులు
- ఇది వరకు పెద్దవారిలో
- ప్రస్తుతం చిన్న పిల్లలకు కూడా వస్తున్న పరిస్థితి
- యువతలో గుండెపోటు కేసులు ఎందుకు పెరుగుతున్నాయ్?
- పూర్తి సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. గుండెపోటు నుంచి తమను తాము రక్షించుకోవడానికి వారి జీవనశైలిలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేది ప్రతి యువకుడి మదిలో మెదులుతున్న ఏకైక ప్రశ్నగా మారుతోంది. ఇందులో ప్రధాన కారణం రక్త ప్రసరణ తగ్గడం లేదా నిరోధించడం వల్ల గుండెపోటు కేసులు యువతలో తరచుగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
READ MORE: Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా చనిపోయే ముందు, చివరి ప్రసంగంలో ఏం చెప్పాడు..?
Also Read
- Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
గుండెనొప్పి రావడానికి ప్రధాన కారణాలు మనందరికీ తెలిసినవే. పెద్దవారిలోనైనా, యువతలో అయినా.. ఒకేలా ఉంటాయి. తినే ఆహారంపై నియంత్రణ లేకపోవడం, శారీరక వ్యాయామం చేయకపోవడం, ఒత్తిళ్లు, ఆందోళనలు, ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్ల వల్ల గుండెపోటు సంభవించే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ కలిసి మొదట్లో బరువు పెరగడానికి కారణం అవుతాయట. ఆపై మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యల్ని తెచ్చిపెట్టి చివరికది గుండె రక్తనాళాల్లో బ్లాకుల్ని తెచ్చిపెట్టే కరోనరి ఆటరీ డిసీస్‌కు దారి తీస్తాయట. ఒకవేళ యుక్త వయసులో గుండెపోటు వస్తే తొందరగా గుర్తించలేమట. లక్షణాలు పెద్దగా కనిపించకపోవడంతో ఒక్కసారిగా విరుచుకు పడి ప్రాణాంతంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే యుక్త వయస్కులు అందరూ కూడా 25 ఏళ్లు దాటాకా గుండె ఆరోగ్యాన్ని తెలిపే కొన్ని పరీక్షలు చేయించుకోవడం అవసరం.
READ MORE:Mallikarjun Kharge: క్షీణించిన మల్లికార్జున ఖర్గే ఆరోగ్యం.. వేదికపై ప్రసంగిస్తూ..
వయసు పైబడిన వారితో పోలిస్తే చిన్న వయసులో వచ్చే గుండెపోటు చాలా ప్రమాదం. ప్రాణాంతకమైంది కూడానూ. ఇందుకు కారణం ఉంది. పెద్ద వయసులో గుండెపోటు ఒక్కసారిగా రాదు. రక్తనాళాల్లో అడ్డంకులు అనేవి క్రమంగా పెరుగుతూ వస్తాయి. ఇలాంటప్పుడు బ్లాక్ అవుతున్న రక్తనాళాలకు పక్కనే కొల్లేటరల్స్ అనే చిన్న చిన్న రక్తనాళాలు పుట్టుకొస్తాయి. దీంతో ప్రధాన రక్తనాళంలో అడ్డంకి మూలంగా రక్తప్రసారం ఆగిపోయినా పక్కనే ఉండే కొల్లేటరల్స్ రక్తనాళాల సాయంతో గుండెకు కొంచెమైనా రక్తం అందుతుంది. యువతలో ఇలాంటి పరిస్థితి కనిపించదు. కొల్లేటరల్ రక్తనాళాలు ఏర్పడకపోవడంతో గుండెపోటు వచ్చినప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంటుంది. సమతుల ఆహారం తీసుకోవడం, నిత్యం కనీసం ఒక గంటపాటు వ్యాయామం చేయటం, ఆందోళన, ఒత్తిళ్లను తగ్గించుకునే విధంగా యోగా, ధ్యానం, పుస్తక పఠనం లాంటి కొన్ని మంచి వ్యాపకాలను ఆశ్రయించడం ద్వారా గుండె రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేట్లు జాగ్రత్త పడొచ్చు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?