Here is the reasons for Kidney Problems in Women: నేటి కాలంలో కిడ్నీ సమస్య సాధారణమైపోయింది. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎక్కువవుతున్నాయి. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే.. ఎన్నో రకాల సమస్యలు చుట్టుముడుతాయి. ఇటీవలి కాలంలో కిడ్నీ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలు తమ అనారోగ్యాన్ని పట్టించుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం అని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కిడ్నీ వ్యాధి సమస్య పురుషులకు కూడా వస్తుంటుంది కానీ.. కొన్ని ప్రత్యేక కిడ్నీ సంబంధిత సమస్యలు మాత్రం మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంన్నాయట. అసలు కిడ్నీ సమస్యలు మహిళల్లో ఎందుకు ఎక్కువగా వస్తున్నాయో ఇపుడు తెలుసుకుందాం.
యుటిఐ సమస్య:
యుటిఐ (యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్) సమస్య వల్ల మహిళల్లో కిడ్నీ సమస్యలు రావచ్చు. ఈ సమస్య మగవారిలో కంటే ఆడవారిలోనే ఎక్కువగా ఉంటుంది. అందుకే మీకు ఈ సమస్య వచ్చిన వెంటనే కచ్చితంగా డాక్టర్‌కి చూపించుకోవాలి. ఎవరైనా సరే యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు.
గర్భం:
గర్భధారణ సమయంలో స్త్రీలకు కిడ్నీకి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. ఈ సమయంలో మహిళల మూత్రపిండాలపై ఒత్తిడి ఉంటుంది. అడియాకే వారిలో అనేక సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యను నివారించడానికి ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
టెన్షన్:
ఒత్తిడికి లోనవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య కూడా రావచ్చు. చాలా ఒత్తిడికి లోనయ్యే స్త్రీలకు కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
Also Read: Fire Accident: వామ్మో.. ఎక్కడి మంటలు.. గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైదాకా నిప్పుల కుంపటే
హార్మోన్ల అసమతుల్యత:
మహిళల్లో పీసీఒఎస్ సమస్య వల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సరైన జీవనశైలి అవసరం. భోజనాల సమయంలో సుదీర్ఘ విరామాలు ఉండవద్దు. అదే సమయంలో శారీరక శ్రమపై కూడా శ్రద్ద వహించండి. వాకింగ్, వ్యాయామం, యోగా లాంటి ఫిజికల్ యాక్టివిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
మధుమేహం సమస్య:
మధుమేహం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు రక్తంలో చక్కెర ఎక్కువ కాలం ఉంటుంది. దీని వల్ల కిడ్నీ దెబ్బతింటుంది. మీరు ఈ సమస్యను నివారించాలనుకుంటే.. మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవాలి.