Shampoo: మనలో దాదాపు అందరము తలస్నానం చేయడానికి షాంపూలు వాడుతూనే ఉంటాము. అయితే షాంపూ నురుగు కారణంగా క్యాన్సర్ వస్తుందా? అంటే అవుననే సైంటిస్ట్ లు సమాధానం చెప్తున్నారు. వీటిలో ఉండే కొన్ని కలుషితాల కారణంగా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. అదేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. షాంపూల్లో సోడియం లౌరిల్ సల్ఫేట్, సోడియం లవరిల్ ఈథర్ సల్ఫేట్ ని క్లెన్సింగ్ ఏజెంట్స్ గా ఉపయోగిస్తారు.
KTR : చోటే భాయ్‌కి చీమ కూడా కుట్టకుండా.. పహారా కాస్తున్న బడే భాయ్ పార్టీ
తలపై చర్మం నుండి మురికి, నూనెను తొలగించడానికి ఇవి వాడతారు. ఈ సల్ఫేట్స్ వాడటం వల్ల వివిధ దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తల చర్మము, చర్మం నుండి సహజ నూనెలను తొలగించడం వల్ల పొడిబారి చికాకు వాపు వస్తుంది. దానితో క్యాన్సర్ కారక పదార్థాలు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎగ్జిమా లేదా కాంటాక్ట్ డర్మటైటిస్ వంటి సున్నితమైన చర్మ పరిస్థితులు ఉన్నవారిపై అలర్జీని కూడా కలిగిస్తుంది.
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు.. వర్షాకాల సమావేశాలలోపే?
ఈ సల్ఫేట్స్ అధికంగా ఉండే ఉత్పత్తులను దీర్ఘకాలం వాడటం కారణంగా శరీరంలో క్యాన్సర్ కారకాలను పెంచుతుంది. అలా కాకుండా సహజంగా దొరికే కొబ్బరి నుండి తీసుకోబడిన సర్ఫెక్టెంట్స్ మొక్కల నుంచి తీసుకోబడిన క్లెన్సర్స్, అమినో యాసిడ్స్ నుంచి తీసుకోబడిన సర్ఫెక్టెంట్స్ కలబంద, కుంకుడుకాయలు, సీకకాయలు సహజమైనవి వీటిని ప్రత్యామనాయంగా వాడటం చాలా మంచిది.