రంజాన్ వచ్చిదంటే చాలు.. హైదరాబాద్‌లో స్పెషల్ డిషెస్ దర్శనమిస్తుంటాయి. అందులో చార్మినార్ ఏరియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రంజాన్ మాసంలో చార్మినార్ సైడ్ వెళ్లామంటే చాలు.. వెరైటీ వంటకాలే కాకుండా స్పెషట్ డిషెస్ నోరూరిస్తుంటాయి. తంగ్డి కబాబ్.. కవ్విస్తూ.. పాయాను పాయసంలా తాగమంటుంది. అంతేకాదు.. అరుదుగా లభించే పత్తర్ ఖా ఘోష్ తీనాల్సిందే. ఇలాంటి ఎన్నో స్పెషల్ డిషెస్‌ను మీ ముందుకు తీసుకువచ్చేందుకు ఎన్టీవీ లైఫ్ స్టైల్ ఛానెల్ ఎప్పుడూ ముందుంటుంది.
అయితే.. చార్మినార్‌లో ఎక్కడ చూసినా.. రంజాన్ వంటకాలు కనిపిస్తుంటాయి.. కానీ.. ఇక్కడ మనకు 7 స్పెషల్ స్ర్టీట్ ఫుడ్ సెంటర్‌లను మీ ముందుకు తీసుకువస్తున్నాము.
1. సోను కబాబ్ : ప్రతి రంజాన్ సీజన్‌లో సోను కబాబ్ ప్రత్యేకంగా కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఇక్కడ.. మలాయ్ పాయా, మటన్ మరగ్, పత్తర్ ఖా ఘోష్ లాంటి వెరైటీ.. వెరైటీ వంటకాలు ఇక్కడ మనం ఆస్వాదించవచ్చు.
2. హోటల్ షాదాబ్ : మీరు రంజాన్ మాసంలో హలీం తినాలనుకుంటే.. అదికూడా చార్మినార్ ఏరియాలో తినాలి అనుకుంటే మాత్రం హోటల్ షాదాబ్‌ను ఓ సారి విజిట్ చేయాల్సిందే.. ఇక్కడ లభించే హలీం.. అన్ని హలీం టేస్టుల్లో బెస్ట్ అని చెప్పొచ్చు. దీనితో పాటు.. ఈ హోటల్ ఆల్‌టైం స్పెషల్.. మటన్ బిర్యానీ, తలావా ఘోష్ రుచి చూడాల్సిందే.
3. మిలాన్ జ్యూస్ సెంటర్ : చార్మినార్ ఏరియాలో ఈ జ్యూస్ సెంటర్ గురించి తెలియని వారుండరు. మిలాన్ జ్యూస్ సెంటర్.. జ్యూస్‌లకు పెట్టింది పేరు. చార్మినార్‌లో ఎవ్వరు ఎక్కడ తిన్నా.. చివరకు ఈ జ్యూస్ సెంటర్‌కు రావాల్సిందే. ఇక్కడ మనకు.. షాదూద్ మలాయ్, మ్యాంగో మలాయ్, డ్రైఫ్రూట్ మలాయ్ లాంటి.. రుచికరమైన డిసర్ట్‌లను ఇక్కడ రుచిచూడోచ్చు.
4. బుర్హన్‌పూర్ కోవా జిలేబీ : మనం మాములూగా జిలేబీ తింటుంటా.. కానీ ఇక్కడ జిలేబీని కోవాతో తయారు చేస్తారు. అందుకే ఇక్కడి ఇది స్పెషల్.. దీంతో పాటు మరిన్ని వెరైటీ స్వీట్లను మనం టేస్ట్ చేయవచ్చు.
5. అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ : ఇక్కడ పరోటాతో చికెన్ 65, చికెన్ ఫ్రై స్పెషల్. ఓసారి ఇక్కడ తిన్నారంటే.. మళ్లీ ఈ టేస్ట్ గురించి ఇక్కడకు రావాల్సిందే. అంతేకాకుండా తందూరి చికెన్ కూడా ప్రత్యేకం.
6. మత్‌వాలే దూద్ ఘర్ : మీరు చార్మినార్ ఏరియాలో లస్సి గానీ, ఫాలూదా రుచి చూడాలనుకుంటే మాత్రం ఇక్కడకు వెళ్లాల్సిందే.
7. నిమ్రహ కేఫ్ : హైదరాబాద్‌లో ఇరాణి చాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో చార్మినార్ ఏరియాలో ఇరాణి చాయ్ తాగాలంటే మాత్రం.. నిమ్రహ కేఫ్‌కు వెళ్లాల్సిందే.
అయితే మీరు ఇప్పుడు చూసిన ఈ ఏడు స్ట్రీట్ ఫుడ్‌ల గురించి ఒక్కొటిగా మీ ముందుకు తీసుకువస్తాం. కాబట్టి మా వార్తలను ఫాలో అవుతూ ఉండండి. ఎన్టీవీ లైఫ్ స్టైల్ అండ్ ఎన్టీవీ తెలుగు.