Pregnancy Tips: గర్భధారణ సమయంలో చాలా జంటలకు ఒక సాధారణ సందేహం వస్తుంది. అదేంటంటే.. గర్భధారణ సమయంలో ఇంటర్ కోర్స్ చేయొచ్చా లేకపోతే మానేయాలా? అని. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీలో సాధారణంగా పెద్ద సమస్య ఉండదు. ఎందుకంటే, సర్విక్స్ (గర్భాశయ ద్వారం) దగ్గర ఉండే ప్రభావం బేబీకి నేరుగా తగలదు. బిడ్డ గర్భాశయంలో పైభాగంలో సేఫ్‌గా ఉంటుంది.
అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఇలా చేయడం పూర్తిగా మానేయాలని సూచిస్తారు. ఉదాహరణకు, ప్లాసెంటా లో లైయింగ్ (Placenta previa) ఉన్నప్పుడు కలవడం చేస్తే బ్లీడింగ్ అవ్వచ్చు.. కాబట్టి అది ప్రమాదకరం. అలాగే, ఎవరైనా మహిళకు గతంలో తరచూ అబార్షన్స్ (గర్భస్రావాలు) జరిగి ఉంటే లేదా మొదటి మూడు నెలల్లో అబార్షన్ జరిగిన హిస్టరీ ఉంటే, జాగ్రత్తగా ఉండి కలవడం మానేయడం మంచిది.
PACL Scam: 10 రాష్ట్రాల్లో బ్రాంచులు.. రూ.49 వేల కోట్ల కుంభకోణం… కంపెనీ డైరెక్టర్ అరెస్ట్..
ఇంకా, గత గర్భధారణల్లో నెలలు నిండకముందే బిడ్డలు పుట్టిన హిస్టరీ ఉన్నవారు అయితే వారు అదనంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నిజానికి మొదటి మూడు నెలలే కాదు.. చివరి మూడు నెలల ప్రెగ్నెన్సీ కూడా చాలా సెన్సిటివ్ టైమ్. ఈ సమయంలో కలవడం వల్ల కొన్నిసార్లు నొప్పులు (లేబర్ లైక్ పెయిన్) వచ్చే అవకాశం ఉంటుంది. మరికొంతమందికి డాక్టర్లు సర్వైకల్ స్టిచ్ (Cervical cerclage) వేస్తారు. అంటే గతంలో గర్భస్రావాలు లేదా ముందస్తు డెలివరీలు జరిగితే జాగ్రత్త కోసం సర్విక్స్ దగ్గర స్టిచ్ వేస్తారు. అలాంటి సందర్భాల్లో కూడా కలవడం మానేయాలని కచ్చితంగా చెబుతారు.
Pregnancy Tips: గర్భధారణకు గోల్డెన్ డేస్.. ఏ రోజులు ప్రెగ్నెన్సీకి రావడానికి ఎక్కువ అవకాశం?
మొత్తం మీద, హెల్ధీ ప్రెగ్నెన్సీలో సాధారణంగా కలవడం వల్ల సమస్య ఉండదు. కానీ, పై చెప్పిన రిస్క్ ఫాక్టర్స్ ఉన్నప్పుడు మాత్రం పూర్తిగా మానేయడం సేఫ్. ఎప్పటికప్పుడు మీ గైనకాలజిస్ట్ సలహా తీసుకోవడం ఉత్తమం.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.