Pregnancy Tips: ఆడవారిలో ఇప్పటి చాలామందికి గర్భధారణకు సంబంధించి చాలానే అనుమానాలు ఉంటాయి. ఇందులో చాలామంథింకి ప్రధానంగా ఏ డేట్స్ లో కలిస్తే గర్భధారణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని? మరి ఆ రోజులు ఏంటి? వాటిని ఎలా లెక్కించాలన్న వివరాలను చూద్దామా..
సాధారణంగా రెగ్యులర్ మెనస్ట్రువల్ సైకిల్ (పీరియడ్స్ సమయం) ఉన్న మహిళల్లో, వారి తర్వాత పీరియడ్ ఎప్పుడొస్తుందో ఆ తేదీ నుంచి 14 రోజులు మైనస్ చేస్తే ఎగ్ రిలీజ్ అయ్యే రోజు వస్తుంది. ఎందుకంటే ఎగ్ రిలీజ్ (ఒవ్యులేషన్) అయిన 14 రోజుల తర్వాత పీరియడ్ మొదలవుతుంది. ఉదాహరణకు, ఆడవారి తదుపరి పీరియడ్ 30వ తేదీన మొదలవుతుందని అనుకుంటే.. 14 రోజులు వెనక్కి లెక్కిస్తే.. అంటే 16వ తేదీకి ఎగ్ రిలీజ్ అయ్యే అవకాశముంటుంది.
BCCI President: బీసీసీఐ అధ్యక్షుడి రాజీనామా.. మరి కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టేది ఎవరు..?
ఇలా ఎగ్ రిలీజ్ అయ్యే రోజుకు ముందు 4 రోజులు, ఎగ్ రిలీజ్ తర్వాత 4 రోజులు ఇలా ఈ మొత్తం 8 రోజులు ఫర్టైల్ పీరియడ్ అవుతుంది. అంటే ఈ 8 రోజులలో కలిస్తే ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే, ఈ సమయంలో ప్రతిరోజూ కలవాల్సిన అవసరం లేదు. ప్రతి రెండో రోజు (ఆల్టర్నేట్ డే) కలిస్తే సరిపోతుంది. అయితే దీనికి కూడా కారణం లేకపోలేదు. అదేంటంటే.. పురుషుల స్పెర్మ్ లైఫ్ స్పాన్ సుమారు 72 గంటలు (3 రోజులు) వరకు ఉంటుంది. కాబట్టి ఒకసారి స్పెర్మ్ వజైనాలోకి వెళ్ళాక, 3 రోజుల వరకు అది జీవించి ఎగ్‌ని ఫర్టిలైజ్ చేయగలదు.
Asia Cup 2025: ఈ జట్టుతో మనం కప్ గెలవలేం.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
అయితే ఇక్కడ ఇంకో తెలియాల్సిన విషయం ఏంటంటే.. మహిళల అండం మాత్రం ఎక్కువ కాలం ఉండదు. అది 24 నుంచి 48 గంటల్లో ఫర్టిలైజ్ కాకపోతే నశిస్తుంది. అంటే, సరైన సమయంలో కలిస్తే స్పెర్మ్ + ఎగ్ ఒకేసారి కలిసిపోతే చాలు గర్భధారణ జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, మీ నెక్స్ట్ పీరియడ్ డేట్ నుంచి 14 రోజులు వెనక్కి లెక్కించుకొని, ఆ రోజుకు ముందు, తర్వాత 4 రోజులు కలిపి మొత్తం 8 రోజులు ఫర్టైల్ పీరియడ్‌గా పరిగణించండి. ఈ సమయంలో ప్రతి రెండో రోజు కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.