సాధారణంగా అన్ని సీజన్లలో లభించే ఏకైక పండు అరటి పండు. అరటి పండు ఎంతో రుచిగా.. ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి. కానీ అరటిపండ్ల ప్రయోజనాలు అవి ఎంత పండాయో దానిపై కూడా ఆధారపడి ఉంటాయి. ఆకుపచ్చ, పసుపు, గోధుమ రంగుల మచ్చలను కలిగి ఉంటాయి అరటి పండ్లు. అయితే.. అరటిపండు యొక్క ప్రతి దశ విభిన్న పోషక విలువలు కలిగి ఉంటాయి. ఇవి మన శరీరంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ విషయాన్ని హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్‌లోని ఎయిమ్స్‌లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి వెల్లడించారు.
Read Also:Investement: మీరు ఒకే సారి మొత్తం అమౌంట్ తో ఇళ్లు కొనాలనుకుంటున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి
ఆకుపచ్చ అరటిపండ్లు తినేందుకు ఎంతో ఉత్తమమైనవని సౌరభ్ సేథి తెలిపారు. ఈ ఆకు పచ్చ అరటి పండ్లు ఎక్కువగా రెసిస్టెంట్ స్టార్చ్ ను కలిగి ఉంటుంది. ఇవి పేగులకు ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా.. చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల ఆకుపచ్చ అరటిపండ్లలో 10 గ్రాముల ప్రక్టోజ్ మాత్రమే ఉంటుందని నిపుణులు తెలిపారు. ఇవి రక్తంలో చక్కెర నియంత్రించేందుకు పనిచేస్తాయని చెప్పుకొచ్చారు. కాకపోతే.. ఇవి కొందరకి అంత తొందరగా జీర్ణం కాకపోవచ్చు.
లేత ఆకుపచ్చ అరటిపండ్లలో ఫైబర్, చక్కెర సమతుల్యం చేయడంతో సరైనది. 100 గ్రాముల లేత ఆకుపచ్చ అరటిపండులో 2.5 గ్రాముల ఫైబర్.. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి శక్తిని అందిస్తాయి.. అంతే కాకుండా రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఇది వాటిని ప్రతిరోజూ తినడానికి ఆరోగ్యకరమైన అరటిపండుగా పని చేస్తుంది.
అరటిపండు పూర్తిగా పసుపు రంగులోకి మారినప్పుడు.. దానిలో ఉన్న పిండిపదార్థం చక్కెరగా విచ్చిన్నమవుతుంది. అయితే ఇది సులభంగా జీర్ణమయ్యి.. శక్తినిస్తుంది. అరటిపండ్లలో తక్కువ నిరోధక పిండి పదార్ధం ఉంటుందని డాక్టర్ సేథి తెలిపారు. కానీ ఎక్కువ విటమిన్ సి, బి5 యాంటీఆక్సిడెంట్లు ఉంటాయన్నారు.. అందువల్ల, వ్యాయామానికి ముందు లేదా అలసట తర్వాత తక్షణ శక్తి కోసం ఇది ఉత్తమ ఎంపికని ఆయన అన్నారు..
Read Also:Herbal Tea: హెర్బల్ టీ తాగడంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…
అరటిపండుపై గోధుమ రంగు మచ్చలు కనిపిస్తే.. వాటిని పారవేయవద్దని నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో అరటిపండ్లు తియ్యగా, మృదువుగా ఉంటాయి. వీటిని ఎక్కువగా జ్యూస్ లు, బ్రెడ్ కోసం, మిల్క్ షేక్ లలో ఉపయోగించవచ్చు. దీనిలో 17 గ్రాముల చక్కెర ఉంటుందని డాక్టర్ సేథి తెలిపారు.. ఇందులో కొంచెం తక్కువ ఫైబర్ ఉంటుంది, కానీ అత్యధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది. అయితే ఈ సమాచారం మేము ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాము. మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహాలు తీసుకుంటే మంచింది.