చలి కాలంలో ఎక్కువగా హెర్బల్ టీ తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లైకోరైస్ లాంటి సువాసన వాతావరణాన్ని ప్రశాంతపరుస్తుంది. కానీ ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పాత కాలం నుంచి మూలికా వైద్యంలో స్టార్ అనిస్ ను వినియోగిస్తున్నారు.
Read Also: TG TET 2025 : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
అయితే.. ఈ హెర్బల్ ఛాయ్ అనేది.. పూర్తిగా మన ఇంట్లో దొరికే సుగంధ ద్రవ్యాలతో తయారు చేసుకోవచ్చే. వేడి నీటిలో ఇలాచ్చి, దాల్చిన చెక్క, పుదీనా, జాజీకాయ, జాపత్రి, తేనె, అల్లం వంటి మిశ్రమాలతో ఈ హెర్బల్ టీని తయారు చేస్తారు. ఇవి ఉల్లాసాన్ని.. ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటుగా.. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ హెర్బల్ టీని ఎంతో మంది ఇష్టపడుతున్నారు. ఈ హెర్బల్ టీలో ఎటువంటి కెఫిన్ ఉండదు.
Read Also: Off The Record : జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ తెలంగాణ బీజేపీని టెన్షన్ పెడుతుందా?
అయితే ఈ టీని ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత తీసుకోవడంతో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరం, మనస్సుకు రిలాక్సేషన్ ఇస్తుంది. గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని వెచ్చని ఆవిరి, వాసన గొంతు నొప్పి లేదా జలుబును కూడా తగ్గిస్తుంది. గర్భవతులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు, పిల్లలు ఈ హెర్బల్ టీని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిందంటున్నారు నిపుణులు.
అయితే.. ఈ సమాచారం అంతా పూర్తిగా ఇంటర్నెట్ నుంచి సేకరించింది. మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వాలనుకుంటే ముందుగా దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించి.. సరైన సలహాలు తీసుకోవాలి..