Monsoon Health Tips: ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. విఫా తుఫాన్ అవశేషం కావడంతో బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. వచ్చే రెండు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలతో పాటు రోగాలు కూడా వచ్చేస్తాయి. కొన్ని జాగ్రత్తలు పాటించకుంటే.. పిల్లలు, పెద్దలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
READ MORE: Air India Crash: ఎయిర్ ఇండియా క్రాష్ తర్వాత, ‘‘సిక్ లీవ్‌లు’’ పెట్టిన 112 మంది పైలట్లు
వర్షాకాలంలో బ్యాక్టీరియాలు, వైరస్లు మనుషుల మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఎప్పుడు కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచిది. గోరువెచ్చని నీరు తాగాలి. ఫిల్టర్, వాటర్ ప్యూరిఫైయర్ నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీళ్ల బాటిళ్లు తీసుకెళ్లడం మంచిది. రోడ్డు పక్కన లేదా ఎక్కడపడితే అక్కడ ఉన్న నీటిని తాగకండి. వర్షాకాలంలో ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంతవరకు స్ట్రీట్ ఫుడ్ తినడం మానుకోండి. పానీపూరీలు, మసాలా పూరీలు, పావుబాజీ వంటి స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఏదైనా తినడానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఈ చిన్న అలవాటు మిమ్మల్ని ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ నుంచి కాపాడుతుంది.
READ MORE: Heavy Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
పండ్లు, కూరగాయలను ఈ సీజన్లో తప్పకుండా కడగాలి. బండి మీద వర్షపునీటి కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంటికి వచ్చిన వెంటనే మంచి నీటితో శుభ్రంగా కడగడం గుర్తుంచుకోవాలి. దోమలు లేకుండా ఉండేలా చేసుకోండి. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వస్తాయి. దోమలు కుట్టకుండా ఉండాలంటే దోమతెరలు వాడటం మంచిది. నిద్రపోయేటప్పుడు ఫుల్ స్లీవ్స్ ధరించండి. బయట వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి శరీరం వెచ్చగా ఉండేలా మంచి దుస్తులు ధరించండి. పోషకాహారం ఆహారం తినడం మంచిది. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలి. ఇవి వ్యాధులు రాకుండా నివారిస్తాయి. అంతే కాకుండా చుట్టూ ఉండే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిది. ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకూదు.. ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే వాటిని తొలగించండి. పచ్చికాయగూరలు తినొద్దు.. వర్షాకాలంలో ఆకుకూరలు అసలు తినకుండా ఉండటే మంచిది. ఈ జాగ్రత్తలు అన్ని తీసుకుంటూ మన ఇంట్లో ఉండే మసాల దినుసులతో ఈ కషాయాన్ని తయారు చేసుకుని సేవిస్తే ఆయా వ్యాధుల బారిన పడుకుండా ఉండోచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.