Monsoon Health Tips: ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. విఫా తుఫాన్ అవశేషం కావడంతో బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది.
గ్రేటర్ వాసులకు ఏ సమస్యనైనా అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లే సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ యాప్ పేరే మై జీహెచ్ఎంసీ. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. రహదారులపై గుంతలు, చెత్త, మురుగు నీటి వ్యవస్థ బాగోలేకపోయినా... ఇలా ఏ సమస్య అయినా ఒక ఫోటో తీసి యాప్ లో అప్ లోడ్ చేస్తే చాలు... ఏ ప్రాంతం నుంచి ఫోటో అప్ లోడ్ అయితే ఆ ప్రాంత అధికారులకు…
తెలంగాణ రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. ప్రస్తుతం 5,500పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదు అవగా.. ఇక, హైదరాబాద్ లో 2148, కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్ గిరి 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్ లో 208 కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు.