Monsoon Health Tips: ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. విఫా తుఫాన్ అవశేషం కావడంతో బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది.
రాత్రిళ్లు నిద్రపోయేటప్పుడు పీడకలలు రావడం సర్వసాధారణం. కొన్ని సార్లు ఛాతిపై బరువుగా.. ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తోంది. నిద్రలో గుండెలపై దెయ్యం కూర్చుందని నోటిలో మాటలు సైతం రావడం లేదని చెబుతూ ఉంటారు. ఎవరో కూర్చుని, పీకనులుముతున్నట్లు అనిపిస్తుంటుంది. గట్టిగా అరవాలని ఉన్నా.. నోటి నుంచి మాట బయటకు రాదు. ఎంత ప్రయత్నించినా శరీరాన్ని కదిలించలేక పోతాం. దెయ్యం గుండెలపై కూర్చుని పీక నొక్కేసిందని చెప్పుకుంటారు. అది ఎంతవరకు నిజం? నిజంగానే దయ్యం గుండెల మీద కూర్చుని పీక…
కొన్నిసార్లు మనం లోతైన ఆలోచనల్లో మునిగిపోయినప్పుడు లేదా ఆందోళన, భయంతో చుట్టుముట్టబడినప్పుడు.. మన హృదయ స్పందన అకస్మాత్తుగా పెరుగుతుంది. ఈ పరిస్థితి చాలా మందికి సంభవిస్తుంది. సాధారణంగా ఓ వ్యక్తి హృదయ స్పందన నిమిషానికి 60 నుంచి 100 బీట్స్ (BPM) ఉంటుంది. కానీ హృదయ స్పందన రేటు 100 BPM కంటే ఎక్కువగా ఉంటే.. దానిని 'టాచీకార్డియా' అంటారు. ఇది ఎందుకు జరుగుతుంది? ఏదైనా వ్యాధికి సంకేతమా? అనే విషయాలను తెలుసుకుందాం..
రక్తహీనత అంటే శరీరంలో రక్తం లేకపోవడం. ఇది సాధారణంగా మహిళలతో కనెక్ట్ చేయడం ద్వారా మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది మహిళల్లో హిమోగ్లోబిన్ అవసరం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. స్త్రీల శరీరంలో రక్తహీనతకు సరైన పోషకాహారం లేకపోవడం ప్రధాన కారణం. పీరియడ్స్ సమయంలో కూడా మహిళలు ప్రతినెలా చాలా రక్తాన్ని కోల్పోతారు.
హైదరాబాద్‌లోని ప్రణామ్ ఆసుపత్రి ఓ రోగి ప్రాణాలను కాపాడింది. ప్రణామ్ హాస్పిటల్స్ కి చెందిన సర్జికల్ బృందం ఒక రోగి కడుపులో నుంచి 8.5 కిలోల భారీ అండాశయ కణితిని తొలగించింది. అధునాతన వైద్య పరికరాలు, పలు విభాగాల్లో నైపుణ్యం కలిగిన ఈ ఆస్పత్రి బృందం కణితిని విజయవంతంగా తొలగించి మరో మైలురాయిని సాధించింది. ఈ వ్యాధి బారిగన పడిన రోగి మధ్య వయస్కురాలు. ఆమె కొన్ని నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పి, వాపుతో బాధపడుతున్నారు. రోగిని…
ఎండలు మండిపోతున్నాయి. మద్యం ప్రియులకు వేడి గట్టిగా తగులుతోంది. దీంతో.. లిక్కర్ నుంచి బీర్ల వైపు మనసు మళ్లుతుంటారు. బీర్ కూల్ అవ్వకముందే.. ఫ్రిడ్జిలో నుంచి తీసి ఇచ్చేయ్యాల్సిందే. అయితే బీర్లు ఎక్కువగా తాగడం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలిలో పర్యటించారు. సిల్వాసాలో నమో ఆసుపత్రిని ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.2,500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించిన ఆయన ఊబకాయం సమస్యను ప్రస్తావించారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయంతో బాధపడుతారని ప్రధానమంత్రి ఒక నివేదికను ఉటంకిస్తూ అన్నారు. ప్రధానమంత్రి ఈ గణాంకాలను ప్రమాదకరమైనవిగా అభివర్ణించారు.
Obesity Causes: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఊబకాయం (Obesity) ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి, అనారోగ్యకరమైన అలవాట్లు ఇవన్నీ బరువు పెరగడానికి ప్రధాన కారణాలు. ఊబకాయం మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కీళ్ల సమస్యలు వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 4న “ప్రపంచ ఊబకాయ…
మంత్రి సీతక్క ఆదేశాలతో వరంగల్ జిల్లా జంగాలపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్ చేశారు అధికారులు. RWS నీటి పరీక్షలు ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు. ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాల వల్ల సుమారుగా 17 మంది చనిపోవడం జరిగింది.